బాలయ్యను వెనకేసుకొస్తున్న పూరి.. నిజమెంత?

తను అనుకున్నది మొహమాటం లేకుండా చెప్పడంలో ముందుండే దర్శకుడు పూరి జగన్నాథ్. అందుకే అతన్ని డాషింగ్ డైరెక్టర్ అంటారు. అలాంటి పూరి ఇప్పుడు తన సోషల్ మీడియాలో ఓ వీడియోని పోస్ట్ చేసాడు. ‘బి ఏ లయన్’ అంటూ క్యాప్షన్ కూడా పెట్టాడు. ఈ వీడియో ‘అడవిలో నివసించడం ఎలా?’ అనే ప్రశ్నతో పాటు మరికొన్ని ప్రశ్నలతో వీడియో కొనసాగింది.” ‘అతి పెద్ద జంతువు’ ఏది అంటే నేను ‘ఏనుగు’ అని చెప్పడం విన్నాను. ‘పొడవైన జంతువు ఏది’ అని అడిగితే నేను ‘జిరాఫీ’ అని చెప్పడం విన్నాను. తెలివైన జంతువు ఏది అని అడిగితే నేను ‘నక్క’ అని చెప్పడం విన్నాను.అతి వేగంగా పరిగెత్తే జంతువు ఏదని అడిగితే నేను చిరుత అని చెప్పడం విన్నాను.

ఇప్పటివరకూ చెప్పిన వండర్ ఫుల్ క్వాలిటీస్ లో ‘లయన్’ లేదు ఏంటి? అని అడిగితే.. ‘ఇందులో లేకపోతే ఏంటి? ‘సింహం’ ‘అడవికి రాజు’ అని మీరు అంటున్నారు. ఎందుకంటే ‘సింహం’ ధైర్యం.. బోల్డ్.. కాన్ఫిడెంట్ గా నడుస్తుంది. సింహం ప్రతీదాన్ని ధైర్యంగా ఎదుర్కొంటుంది.. దేనికీ భయపడడు. తననెవరూ ఆపలేరని భావిస్తుంది. సింహం కు వచ్చిన అవకాశాన్ని అస్సలు చేజార్చుకోదు. మనం సింహం నుండీ ఏం నేర్చుకోవచ్చు? నువ్వు వేగంగా పరిగెత్తాల్సిన అవసరం లేదు.. స్మార్ట్ బ్రిలియంట్ అవ్వాల్సిన అవసరం లేదు. నీకు కావాల్సింది ‘ధైర్యం’ ‘బోల్డ్ నెస్’ నీపైన మీకున్న నమ్మకం. ఇప్పుడు అది బయటకి తీసే టైం వచ్చింది. నీలో కూడా ఓ సింహం ఉంది ” అంటూ వీడియో ముగిసింది.

ఇక పూరి ‘ఈ వీడియోని బాలయ్య మీద అభిమానంతోనే పోస్ట్ చేసాడని.నాగబాబుని ఏనుగుతో.. అలాగే బాలయ్యను సింహంతో పోల్చాడని.. ఇక నాగ బాబు కొడుకు వరుణ్ ను ‘జిరాఫీ’ తో పోల్చాడని’ నందమూరి అభిమానులు సంబరపడిపోతూ… దీనిని కూడా నాగబాబుని ట్రోల్ చెయ్యడానికి ఉపయోగించుకుంటున్నారు. పూరిని డ్రగ్స్ కేసులో పోలీసులు విచారించినప్పుడు.. బాలయ్య సేవ్ చేసాడని.. అదే అభిమానంతో ఇప్పుడు నాగబాబు.. బాలయ్యను విమర్శిచడంతో.. ఈ వీడియోని ఉపయోగించుకుని నాగబాబు పై కౌంటర్ వేసాడని చర్చించుకుంటున్నారు. అయితే నిజంగా పూరి బాలయ్యను సమర్ధిస్తూ.. నాగబాబు పై సెటైర్ వేశాడా అనేది అర్ధం కానీ ప్రశ్న.

Most Recommended Video

రన్ మూవీ రివ్యూ & రేటింగ్
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!
ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus