బాహుబలి గురించి పూరి జగన్నాథ్ ఏమన్నారంటే ?
- April 15, 2017 / 07:55 AM ISTByFilmy Focus
బాహుబలి బిగినింగ్ రిలీజ్ అయిన సమయంలో పూరి జగన్నాథ్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. వంద రూపాయలతో సినిమాను చూస్తాను కానీ.. అటువంటి సినిమా తీయనని మీడియాకు చెప్పి డేరింగ్ డైరక్టర్ అనిపించుకున్నారు. తాజాగా బాహుబలి కంక్లూజన్ గురించి పూరి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అది రాజమౌళి, సినిమాపై సెటైర్లు కావు.. తనపైనే తాను సెటైర్ వేసుకొని వార్తల్లో నిలిచారు. “ఓ సినిమా కోసం రెండేళ్ల పాటు స్క్రిప్ట్ వర్క్ చేసి, మరో రెండేళ్ల పాటు షూట్ చేయడం వంటివి నా బాడీకి సూట్ అవ్వదు” అని నిర్మొహమాటంగా చెప్పారు.
అంతేకాదు తాను రాసుకున్న స్క్రిప్ట్ రెండు నెలలలకే బోర్ కొట్టేస్తుందని స్పష్టం చేశారు. ఇంకా పూరి మాట్లాడుతూ ” రాసుకునే స్క్రిప్ట్ కంటే నాలుగేళ్ల సమయం అనేది చాలా విలువైంది. అంతటి విలువైన టైమ్ ను నేను వేస్ట్ చేయను. అలా చేస్తే తనతో పాటు తన యూనిట్ లో అందరి టైం వేస్త్ అవుతుంది” అని పూరి జగన్నాథ్ వెల్లడించారు. ఆయన మాటల్లో ఎటువంటి తప్పు కనిపించడం లేదుకానీ .. ఈ వార్త సోషల్ మీడియాలో వీరవిహారం చేస్తోంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















