టాలీవుడ్ దర్శకుడుగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న పూరి జగన్నాథ్ తన పూరి మ్యూజింగ్స్ ద్వారా ఎన్నో విషయాలను తెలియజేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా రియాక్షన్స్ గురించి ఈయన తన మ్యూజింగ్స్ ద్వారా అనేక విషయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా పూరి మాట్లాడుతూ కొన్నిసార్లు మనం కోపంలో ఉన్నప్పుడు లేదా చిరాకుగా ఉన్నప్పుడు మనం ఎలాంటి రియాక్షన్స్ ఇవ్వకుండా ఒక చిన్న నవ్వు నవ్వితే చాలు లేదంట అక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది అని చెప్పుకొచ్చారు.
ఈ విధంగా రియాక్షన్స్ గురించి ఎన్నో విషయాలు తెలియజేస్తూ ఇడియట్ సినిమా సమయంలో హీరోయిన్ రక్షిత నుంచి తనకు ఎదురైనటువంటి ఒక అనుభవాన్ని కూడా తెలియజేశారు.ఈ సినిమా షూటింగ్ సమయంలో రక్షిత ఒక ఏడ్వాల్సిన సీన్లు నటించాల్సి ఉంది అయితే అక్కడ ఆమె ఎమోషనల్ కాకుండా నవ్వుతూ ఉండడంతో తను చేసిన పనికి చాలా కోపం వచ్చి రక్షిత సరిగా నటించలేదు ఇలా చేస్తే తదుపరి సినిమాలో నీకు అవకాశం కల్పించను అంటూ తనకు వార్నింగ్ ఇచ్చాను.
నేను ఇలా అందరి ముందు అరిచేసరికి ఆమె ఏడ్చుకుంటూ షూటింగ్ నుంచి వెళ్లిపోవచ్చు లేదా తన సినిమా షూటింగ్లో పాల్గొననని చెప్పవచ్చు కానీ రక్షిత మాత్రం అలా చేయలేదు. నేను అన్న మాటలకు రక్షిత వెంటనే స్పందిస్తూ రాయి… రాయకపోతే చంపేస్తా నీ తర్వాత పది సినిమాలు నేనే చేస్తా ఇప్పుడు నీకేం కావాలో సరిగా చెప్పి సావు అంది. ఇలా రక్షిత మాట్లాడేసరికి సెట్ లో అందరూ ఒక్కసారిగా క్లాప్స్ కొట్టారు. ఇలా రక్షిత నుంచి ఇలాంటి సమాధానం వస్తుందని నేను ఊహించలేదు
ఆరోజు ఆమె చెప్పిన సమాధానం విని నాకు కూడా చాలా నవ్వు వచ్చిందని పూరి జగన్నాథ్ ఈ సందర్భంగా తెలిపారు. ఇలాంటి సమయంలోనే మనం ఇచ్చే రియాక్షన్స్ వల్ల ఎన్నో సమస్యలను,చికాకులను తగ్గించుకోవచ్చు. ఇక మన గురించి ఎవరైనా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే వాటి గురించి స్పందించి వైల్డ్ రియాక్షన్ ఇవ్వాల్సిన పనిలేదు. కేవలం పనికి వచ్చే వాటికి మాత్రమే స్పందిద్దాం…నవ్వుతూ సమాధానం చెప్పడం ఏ సమాధానం లేకపోతే చిరునవ్వే ఎన్నో సమస్యలకు సమాధానంగా మారుతుంది అంటూ ఈ సందర్భంగా పూరి రియాక్షన్స్ గురించి చెప్పుకొచ్చారు.