పూరి జగన్నాథ్ నెక్స్ట్ సినిమా ఏంటి? దీనికి సమాధానం ‘జేజీఎం’ అని ఈజీగా చెప్పేయొచ్చు. అయితే ఆ తర్వాతి సినిమా ఏంటి? దీనికి సమాధానం చెప్పడం కష్టం. ఎందుకంటే ఇంతవరకు ఈ విషయంలో ఎలాంటి లీక్‌లు, పుకార్లు రాలేదు. అయితే తాజాగా ఓ చిన్న పుకారు ఆసక్తి రేకెత్తిస్తోంది. ఎందుకంటే అన్నీ అనుకున్నట్లుగా జరిగితే పూరి నెక్స్ట్ సినిమా స్ట్రయిట్ బాలీవుడ్ మూవీ అవుతుంది అంటున్నారు. అది కూడా సల్మాన్ ఖాన్‌తో అంటున్నారు.
అవును, సల్మాన్ ఖాన్ – పూరి జగన్నాథ్ మధ్యన ఇటీవల చిన్న మీటింగ్ జరిగిందని అంటున్నారు. ఇందులో భాగంగా సల్లూ భాయ్‌కి పూరి జగన్నాథ్ ఓ పాయింట్ చెప్పారని అంటున్నారు. అన్నీ ఓకే అయితే ‘జేజీఎం’ తర్వాత ఈ సినిమా ఉండొచ్చు అని అంటున్నారు. ప్రస్తుతం ‘లైగర్’ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న పూరి సల్మాన్ ఖాన్ కోసం స్క్రిప్ట్ తన వద్ద ఉందని చెప్పారు. ‘వాంటెడ్’ సినిమా విడుదలైనప్పటి నుండి సల్మాన్‌తో సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నాను’’ అని కూడా చెప్పారు.
‘‘సల్మాన్ ఖాన్ అంటే నాకు చాలా ఇష్టం. ఏదో రోజు అతనిని డైరెక్ట్ చేసే అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను’’ అని కూడా చెప్పారు పూరి. ఇక పూరి జగన్నాథ్ తొలి బాలీవుడ్ చిత్రం ‘బుడ్డా హోగా తేరా బాప్’ మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమాతో పూరి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత విజయాల ఫ్లో మిస్ అయ్యింది. మళ్లీ ‘ఇస్మార్ట్ శంకర్’తో ట్రాక్‌లోకి వచ్చి ఇప్పుడు ‘లైగర్’ తీసుకొస్తున్నారు.
ఇక సల్మాన్ ఖాన్ సరైన విజయం కోసం ఎదురు చూస్తున్నాడు. దీని కోసం ‘కబీ ఈద్ కబీ దివాళీ’ అనే సినిమా చేస్తున్నారు. ‘కాటమరాయుడు’ సినిమాకిది రీమేక్ అని సమాచారం. ఇది కాకుండా ‘టైగర్ 3’ సినిమా కూడా చేస్తున్నాడు. ఈ సినిమాల విజయాలు సల్మాన్‌కే కాదు.. మొత్తం బాలీవుడ్‌కి చాలా అవసరం.
Most Recommended Video
తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?