Puri Jagannadh, Akash Puri: ఆకాష్ తో పూరి జగన్నాధ్ ప్లాన్ ఇదే!

‘ఆంధ్రాపోరి’ సినిమాతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు పూరి జగన్నాధ్ కుమారుడు ఆకాష్ పూరి. ఈ సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో కాస్త గ్యాప్ తీసుకొని ‘మెహబూబా’, ‘రొమాంటిక్’, ‘చోర్ బజార్’ వంటి సినిమాలు చేశారు. ఇవన్నీ కూడా ఫ్లాపులే. కెరీర్ ఆరంభంలో ఒక హీరోకి ఇన్ని ప్లాప్ లు రావడం మంచిది కాదు. అలా అని ఆకాష్ లో టాలెంట్ లేదని కాదు. అతడి నటన, డైలాగ్ డెలివెరీ అన్ని బాగుంటాయి.

కానీ అతడి వయసుకి తగ్గ కథలు పడడం లేదు. ఇటీవలే బండ్ల గణేష్.. పూరి జగన్నాధ్ ను ఉద్దేశిస్తూ.. ‘ఎంతో మందిని సూపర్ స్టార్స్ ని చేశావు కానీ నీ కొడుకుని మాత్రం గాలికొదిలేశావ్’ అంటూ కామెంట్స్ చేశారు. నిజానికి బండ్ల చెప్పినట్లుగా పూరి తన కొడుకుని లైట్ తీసుకోలేదు. ‘రొమాంటిక్’ సినిమా సమయంలో తన కొడుకుకి బాగా సపోర్ట్ చేశారు పూరి. బాగా ఖర్చుపెట్టి ఆ సినిమా తీశారు. ప్రమోషన్స్ కూడా ఓ రేంజ్ లో చేశారు.

కానీ ఏదీ కూడా సినిమాకి కలిసి రాలేదు. అందుకే మరోసారి ఆకాష్ పూరి కోసం ఓ సినిమా తీయాలనుకుంటున్నారట పూరి. తన దగ్గర కథలకు లోటు లేదు. అందులో నుంచి ఓ మంచి కథను ఆకాష్ కి ఇద్దామనుకుంటున్నారట. తన దర్శకత్వ పర్యవేక్షలో, నిర్మాణంలో పూరి ఓ సినిమా చేయాలనుకుంటున్నారు. ఆ విధంగా తండ్రిగా తన బాధ్యత నిర్వర్తించాలని అనుకుంటున్నారు. మరి ఈ సినిమా అయినా ఆకాష్ కి కలిసొస్తుందేమో చూడాలి!

ఇక పూరి సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే ఆయన ‘లైగర్’ సినిమాను పూర్తి చేశారు. ఈ సినిమా రిలీజ్ కాకుండానే విజయ్ దేవరకొండతో మరో సినిమా మొదలుపెట్టారు. వరుసగా విజయ్ తోనే మూడో సినిమా కూడా చేయాలనుకుంటున్నారట పూరి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో చూడాలి!

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus