‘‘నేనెందుకు పుట్టాను. అసలు ఈ భూమి మీద ఎందుకున్నాను. ఏదో కారణం ఉండబట్టే దేవుడు ఇక్కడికి పంపించాడు. అయితే ఆ కారణమేంటి? దానిని తెలుసుకోవడం ఎలా? నా జీవితానికి అర్థం ఏమిటి? పరమార్థం ఏంటి? దేవుడు నా నుంచి ఏం కోరుకుంటున్నాడు? అని చాలామంది ఆలోచిస్తుంటారు. నిజానికి జీవితానికి కారణమంటూ ఏమీ ఉండదు. ఏ ప్రశ్నకూ, విషయానికీ జవాబులు ఉండవు. నేను కారణజన్ముణ్ని అని అనుకున్నవాడే ఎక్కువ పాపాలు చేస్తాడు. నేనేం గొప్పకాదు, కేవలం ఓ ఇసుక రేణువుని మాత్రమే అనుకున్నవాడు ఏ తప్పూ చేయకుండా సంతోషంగా జీవిస్తాడు’’ అని పూరి మ్యూజింగ్స్‌లో తాజాగా చెప్పుకొచ్చారు పూరి జగన్నాథ్.
‘‘మనం తప్పులు చేస్తాం. జంతువులు అలా కాదు. భూమ్మీద మానవజాతంతా అంతరించిపోయినా. ఈ గ్రహానికి నష్టం లేదు. అలాంటి ఏ ఉపయోగం లేని మనిషిని దేవుడు ఏ కారణంతో పంపిస్తాడు చెప్పండి. మనిషి అంటేనే పనికిరానివాడని అర్థం. మనిషి జీవితాలకు అర్థం ఉండదు. అందుకే గుండె ఆగే లోపు ఎన్నిసార్లు నవ్వగలిగితే అంత మంచిది. ఎందుకంటే మన శరీరంలో ఆక్సిటోసిన్, ఎండోర్ఫిన్స్ లాంటి ఎన్నో హార్మోన్లు విడుదల అవుతుంటాయి. వాటి వల్లే ముఖంలో చిరునవ్వు వస్తోంది. కళ్లు కాంతివంతమవుతాయి. మనం ఆనందంగా ఉంటాం. మన చుట్టూ ఉన్నవాళ్లకి అందంగా కనిపిస్తాం’’ అని నవ్వు గురించి, నవ్వడం గురించి చెప్పారు పూరి.
‘‘నవ్వుతూ, నవ్విస్తూ ఉంటే చాలు. అంతకుమించి ఎక్కువగా ఆలోచించొద్దు. అంతేకానీ జీవితపరమార్థం ఏంటి అంటూ ఆలోచించే పని, వెతికే పని పెట్టుకుంటే తొందరగా ఆపేయండి. ఫలానా కారణంతో పుట్టాననుకుంటే. నువ్వు బానిస కింద లెక్కే. ఎందుకంటే నీకో లక్ష్యం ఇచ్చారు. చచ్చినట్టు ఆ పని పూర్తి చేయాలి. కాబట్టి ఏ పర్పస్ లేకుండా పుట్టిన జీవితాలే మంచివి. అందులోనే స్వేచ్ఛ ఉంటుంది. స్వేచ్ఛకు ఉన్న విలువ చాలా ఎక్కువ. దాన్నుండే ఆనందం వస్తుంది. ఇంత కాదు.. సింపుల్‌గా చెప్పాలి అంటే… నీ జీవిత పరమార్థం నీ నవ్వు. కాబట్టి ఎప్పుడూత నవ్వుతూ ఉంటే చాలు’’ అని పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటో వివరించారు పూరి.
Most Recommended Video
టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!