ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), జీనియస్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) ..ల కలయికలో వచ్చిన ‘పుష్ప 2’ (Pushpa 2 The Rule) డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ నిర్మించిన ఈ సినిమాకు ప్రీమియర్స్ తోనే సూపర్ హిట్ టాక్ వచ్చింది. దీంతో మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ఏరియాల్లో డ్రాప్స్ కనిపించాయి. మూడో రోజు కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. కానీ నార్త్, ఓవర్సీస్ వంటి ఏరియాల్లో ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తుంది.
ముఖ్యంగా ఓవర్సీస్ లో హిందీ వెర్షన్ కి కూడా భారీ వసూళ్లు వస్తుండటం విశేషంగా చెప్పుకోవాలి. ఒకసారి (Pushpa 2 The Rule) 3 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 45.92 cr |
సీడెడ్ | 14.80 cr |
ఉత్తరాంధ్ర | 10.80 cr |
ఈస్ట్ | 6.56 cr |
వెస్ట్ | 5.55 cr |
కృష్ణా | 6.94 cr |
గుంటూరు | 9.20 cr |
నెల్లూరు | 3.60 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 103.37 cr |
కర్ణాటక | 16.73 cr |
తమిళనాడు | 3.36 cr |
కేరళ | 8.05 cr |
ఓవర్సీస్ | 40.49 cr |
నార్త్ | 83.48 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 255.48 cr (షేర్) |
‘పుష్ప 2’ చిత్రానికి రూ.600 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.605 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 3 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.255.48 కోట్ల షేర్ ను రాబట్టి ఆల్ టైం రికార్డులు సృష్టించింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.349.52 కోట్ల షేర్ రావాలి. తెలుగు రాష్ట్రాల్లో ఈస్ట్, వెస్ట్ వంటి ఏరియాల్లో అలాగే ఇండియా వైడ్ చూసుకుంటే కేరళ వంటి ఏరియాల్లో ఈ సినిమా ఆశించిన స్థాయిలో కలెక్ట్ చేయడం లేదు.