Pushpa 2 The Rule: మరో నెంబర్ వన్ రికార్డుకు దగ్గరగా పుష్ప 2!

అల్లు అర్జున్ (Allu Arjun)  నటించిన ‘పుష్ప 2’ (Pushpa 2 The Rule)  సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. అన్ని భాషల్లోనూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుని, బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని నమోదు చేస్తోంది. 17 రోజుల్లో ఈ సినిమా గ్లోబల్‌గా 1500 కోట్ల గ్రాస్‌ను దాటి సంచలనాన్ని సృష్టించింది. ఇక మూడో వారం ప్రారంభమైనప్పటికీ, ఈ జోరు ఏమాత్రం తగ్గడం లేదు. ఈ సినిమా హిందీ మార్కెట్‌లో 652.9 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది,

Pushpa 2 The Rule:

ఇది బాహుబలి 2  (Baahubali 2) తర్వాత సౌత్ మూవీలోనే బిగ్గెస్ట్ రికార్డ్. తెలుగులో 302.35 కోట్ల గ్రాస్‌తో అద్భుతమైన వసూళ్లు రాబట్టింది. 17వ రోజైన శనివారం ఒక్కరోజే 25 కోట్ల గ్రాస్‌ ను సాధించి, 1500 కోట్ల క్లబ్‌లో చేరింది. ఆదివారం కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంకా, దేశవ్యాప్తంగా ‘పుష్ప 2’ టోటల్ కలెక్షన్స్ 1029.9 కోట్లు ఉన్నాయి. ఈ సంఖ్య ఆదివారం తర్వాత 1050 కోట్లు దాటుతుందని అనుకుంటున్నారు.

అలా అయితే, బాహుబలి 2 ఇండియన్ గ్రాస్ రికార్డ్ అయిన 1040 కోట్లు బ్రేక్ అవుతుంది. ఇది పుష్ప 2 బాక్సాఫీస్ డామినేషన్‌ని మరింతగా చూపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తోంది. తెలుగు రాష్ట్రాల మొత్తం షేర్ విషయంలో ‘బాహుబలి 2’ తర్వాతి స్థానంలో ఉండగా, ఈ సినిమా త్వరలోనే దానిని అధిగమించనుంది. మరో 3 కోట్ల షేర్ మాత్రమే రావాల్సి ఉండగా, మూడో వారం ముగిసేలోపు ఈ రికార్డును బద్దలుకొడుతుందనే నమ్మకం ఉంది.

ఈ సినిమా విజయంతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్‌గా తన స్థాయిని మరింత పెంచుకున్నారు. సుకుమార్ (Sukumar) దర్శకత్వం, దేవిశ్రీ ప్రసాద్  (Devi Sri Prasad)  సంగీతం, బన్నీ అద్భుతమైన నటన ‘పుష్ప 2’ విజయానికి ప్రధాన కారణాలని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ చిత్రం బాహుబలి 2 లాంగ్ రన్ కలెక్షన్లను దాటుతుందా లేదా అనే ఆసక్తి ఇండస్ట్రీలో పెరిగింది. అభిమానులు కూడా పుష్ప 2 ని నెక్స్ట్ నెంబర్ వన్ మూవీగా చూడటానికి సిద్ధమై ఉన్నారు.

చరణ్ నోట దిల్ రాజు ‘ఇరుకు’ కామెంట్స్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus