అల్లు అర్జున్(Allu Arjun) , సుకుమార్ (Sukumar) ..ల ‘పుష్ప 2’ (Pushpa 2 The Rule) 3 వ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. 2వ వారం బాగా కలెక్ట్ చేసిన ఈ సినిమా … 3వ వారం ఎందుకో డౌన్ అయినట్లు కనిపిస్తోంది. 3వ వీకెండ్ ని ఈ సినిమా పెద్దగా క్యాష్ చేసుకోలేదు. మరోపక్క అల్లు అర్జున్.. సంధ్య థియేటర్ కేసు విషయంలో పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం కూడా ఆడియన్స్ ని డైవర్ట్ చేస్తున్నట్టు అవుతుంది. నార్త్ లో ‘పుష్ప 2’ భారీ లాభాలు రాబడుతుంది.
Pushpa 2 The Rule Collections:
కేరళ, తమిళనాడు వంటి ఏరియాల్లో నష్టాలు తప్పేలా లేవు. ఒకసారి ‘పుష్ప 2’ 19 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే:
‘పుష్ప 2’ చిత్రానికి రూ.600 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.605 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 19 రోజుల్లో ఈ సినిమా రూ.647.13 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.42.13 కోట్ల లాభాలు అందించింది ఈ సినిమా.