అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన ‘పుష్ప’ ‘పుష్ప 2’ సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ‘పుష్ప 2’ క్లైమాక్స్ లో ‘పుష్ప 3’ కూడా ఉంటుందని అనౌన్స్ చేశారు. ‘ ‘పుష్ప 2’ లో మీరు చూసింది ‘పుష్ప 2’ ఫస్ట్ హాఫ్ మాత్రమే.. సెకండాఫ్ కూడా ఉంటుంది ‘ అంటూ ఆ సినిమా సక్సెస్ మీట్లో సుకుమార్ తెలపడం జరిగింది. సో ‘పుష్ప 3’ కచ్చితంగా ఉండబోతుంది.
ఆల్రెడీ ‘పుష్ప 3 : ది రాంపేజ్’ అంటూ టైటిల్ ను కూడా రివీల్ చేశారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు ఉంటుందని అంతా భావించారు. కానీ కట్ చేస్తే.. ఈ ప్రాజెక్టు ఇప్పట్లో ఉండదని చెప్పి అభిమానులకి పెద్ద షాకిచ్చారు నిర్మాత నవీన్ ఎర్నేని.
ఈరోజు జరిగిన ‘డ్యూడ్’ సక్సెస్ మీట్లో భాగంగా.. తమ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి నవీన్ కి ప్రశ్న ఎదురైంది. ఇందులో భాగంగా.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా సాంగ్స్, టీజర్ వంటివి త్వరలో రిలీజ్ చేస్తామని ఆయన తెలిపారు. సినిమా బాగా వచ్చిందని.. 12 ఏళ్లుగా హరీష్ కసితో ఉన్నట్టు పనిచేశారని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. అలాగే ‘పుష్ప 3’ గురించి ప్రశ్నించగా.. ఇప్పట్లో ఆ ప్రాజెక్టు ఉండదని… ముందుగా రామ్ చరణ్- సుకుమార్..ల ప్రాజెక్టు మొదలు పెడతామని క్లారిటీ ఇచ్చారు.
‘పెద్ది’ పూర్తయ్యాక 2026 ఏప్రిల్ నుండి చరణ్- సుకుమార్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తుందని స్పష్టంచేశారు. ఇక రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా 2026 మార్చి 27న రిలీజ్ కాబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.