ఆగస్టు 13న ఐదు భాషల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప తొలి సింగిల్ ‘దాక్కో దాక్కో మేక’ విడుదల..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ అంటే చాలు అభిమానులు ఊగిపోతారు. ఈ కాంబినేషన్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అలా ఉంది. ఈ ముగ్గురు పేర్లు ఒక పోస్టర్ పై కనిపిస్తే థియేటర్ బయట జనాలు డాన్స్ చేస్తారు. సుకుమార్, అల్లు అర్జున్, దేవి కాంబినేషన్లో వచ్చిన ఆర్య, ఆర్య 2 పాటలు ఇప్పటికీ మార్మోగుతూనే ఉంటాయి. పదేళ్ల తర్వాత ఈ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా పుష్ప. ఆగస్టు 13న ఐదు భాషల్లో పుష్ప తొలి సింగిల్ విడుదలవుతుంది. దీనికి సంబంధించిన టీజర్ ఇప్పటికే సంచలన సృష్టించింది. ఈ పాటకు సంబంధించిన కొన్ని ప్రీ టీజర్స్ కూడా ఇప్పటికే విడుదల చేశారు దర్శక నిర్మాతలు. వీటికి సైతం మంచి స్పందన వస్తుంది. ముఖ్యంగా అల్లు అర్జున్ మేకోవర్ ఈ పాటలో హైలైట్‌గా నిలవనుంది.

ఐదు భాషల్లో 5గురు లీడింగ్ సింగర్స్ ఈ పాట పాడబోతున్నారు. తెలుగులో శివం.. హిందీలో విశాల్ దడ్లాని.. కన్నడంలో విజయ్ ప్రకాష్.. మలయాళంలో రాహుల్ నంబియార్.. తమిళంలో బెన్నీ దయాల్.. దాక్కో దాక్కో మేక పాటను ఆలపించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మందన నటిస్తున్నారు. రెండు భాగాలుగా పుష్ప సినిమా రానుంది. పాన్ ఇండియా స్థాయిలో పుష్ప సినిమాను తెరకెక్కిస్తున్నారు సుకుమార్. క్రిస్మస్ సందర్భంగా సినిమా విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus