అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 3వ చిత్రం ‘పుష్ప’. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి భాగం ‘పుష్ప ది రైజ్’ పేరుతో పాన్ ఇండియా లెవెల్లో డిసెంబర్ 17న విడుదల అయ్యింది. ‘ముత్తంశెట్టి మీడియా’ సంస్థతో కలిసి ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. మొదటి రోజు ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లల పరంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది ఈ చిత్రం. విడుదలై 12 రోజులు పూర్తికావస్తోన్నప్పటికీ ఇంకా మంచి కలెక్షన్లను రాబడుతూనే ఉంది.
‘పుష్ప’ 12 రోజుల కలెక్షన్లను ఓసారి గమనిస్తే :
నైజాం
34.71 cr
సీడెడ్
12.67 cr
ఉత్తరాంధ్ర
7.15 cr
ఈస్ట్
4.53 cr
వెస్ట్
3.75 cr
గుంటూరు
4.88 cr
కృష్ణా
3.86 cr
నెల్లూరు
2.88 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
74.43 cr
తమిళ్ నాడు
6.96 cr
కేరళ
4.54 cr
కర్ణాటక
9.65 cr
రెస్ట్
18.20 cr
ఓవర్సీస్
11.50 cr
టోటల్ వరల్డ్ వైడ్
125.28 cr
‘పుష్ప ది రైజ్’ కి అన్ని వెర్షన్ లు కలుపుకుని రూ.145.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.146 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 12 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.125.28 కోట్ల భారీ షేర్ ను రాబట్టింది. అంటే బ్రేక్ ఈవెన్ కు రూ.20.72 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఆంధ్రలో తప్ప మిగిలిన అన్ని ఏరియాల్లోనూ ఈ చిత్రం బాగా పెర్ఫార్మ్ చేస్తుంది.