Pushpa Movie : సోషల్ మీడియాలో పుష్ప మూవీ వీడియో వైరల్!

స్టార్ హీరో అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్రలో నటిస్తున్న పుష్ప మూవీకి లీకుల బెడద తప్పడం లేదు. ఈ సినిమా నుంచి రిలీజ్ కు ముందే దాక్కో దాక్కో మేక సాంగ్ లీక్ కాగా కొన్ని సెకన్ల వీడియో కూడా లీకైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కాకినాడ పోర్టుకు సమీపంలో పుష్ప మూవీ షూటింగ్ జరుగుతోంది. అయితే ఈ షూటింగ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫుటేజ్ లీక్ కావడంతో చిత్రయూనిట్ టెన్షన్ పడుతోంది.

మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో పుష్ప మూవీని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. చిత్రయూనిట్ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఈ సినిమాకు సంబంధించిన వీడియోలు లీకవుతూ ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతున్నాయి. తాజా వీడియో ఏ విధంగా లీక్ అయిందో మేకర్స్ కు అర్థం కావడం లేదని సమాచారం. చిత్రయూనిట్ లీకవుతున్న వీడియోల గురించి మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. బన్నీ ఫ్యాన్స్ సైతం సినిమాకు సంబంధించిన వీడియోలు వైరల్ కాకుండా తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

దాదాపు 150కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా ఈ సినిమా తెరకెక్కుతోంది. రష్మిక మందన్నా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా డిసెంబర్ 17వ తేదీన ఈ సినిమా రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయి. క్రిస్మస్ కానుకగా రిలీజ్ కానున్న ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus