Pushpa Movie: పుష్ప ప్రభావం.. ఎర్రచందనం రియల్ స్మగ్లింగ్!

పుష్ప సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు ఏ స్థాయిలో అందుకుందో అదే తరహాలో ఓ వర్గం మహానుభావుల నుంచి విమర్శకులు కూడా ఎదుర్కొంటోంది. ఇక ఉదయన్నే ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహ రావు పుష్ప సినిమాపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సినిమా యువతను తప్పుదోవ పట్టించేలా ఉందని ఎర్ర చందనం స్మగ్లింగ్ ఎలా చేయాలో సినిమాలో హైలెట్ చేయడం ఏ మాత్రం కరెక్ట్ కాదని దర్శకుడు హీరో నాతో మాట్లాడితే కడిగి పారేస్తాను అని అన్నారు.

అయితే ఆయన అలా కామెంట్ చేశారో లేదో పుష్ప సినిమా ప్రభావంతో ఒక వ్యక్తి భారీ స్థాయిలో స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డాడు. బెంగళూరులో చోటు చేసుకున్న ఈ ఘటన దేశవ్యాప్తంగా మీడియాలో వైరల్ గా మారింది. యాసిన్ ఇనయితుల్లా అనే వ్యక్తి ట్రక్కు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అయితే ఇటీవలే పుష్ప సినిమా చూసిన అనంతరం అతను అదే స్టైల్ లో తన ట్రక్కులో కూడా ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేయాలనుకున్నాడు.

ఆంధ్ర- కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో అతను స్మగ్లింగ్ చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. మహారాష్ట్ర మార్గమధ్యంలో పోలీసులు అతన్ని వెంటాడి పట్టుకున్నట్లు సమాచారం. సరిహద్దు దాటుతుండగా… సాంగ్లీ జిల్లాలోని మీరజ్ నగర్ గాంధీ చౌక్‌లో మహారాష్ట్ర పోలీసులు అతన్ని పట్టుకున్నారు. దాదాపు 2 కోట్ల 45 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలతో అలాగే 10లక్షల విలువైన ట్రక్కును స్వాధీనం చేసుకున్నారు.

స్మగ్లింగ్ గురించి సమాచారం అందగానే అటవీ అధికారులు కూడా జాయింట్ ఆపరేషన్ నిర్వహించి పట్టుకున్నామని పోలీసులు వివరణ ఇచ్చారు. ఇక ట్రక్కును స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేయగా అనంతరం అతను పుష్ప సినిమా నుంచి స్ఫూర్తి పొంది ఈ ఘటనకు పాల్పడినట్లు చెబుతున్నారు. దీంతో ఒక్కసారిగా న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus