Pushpa Release Date: పుష్ప పార్ట్ 1 రిలీజ్ డేట్ ఇదే?

వరుస విజయాలతో జోరుమీదున్న మైత్రీ మూవీ మేకర్స్ సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా పుష్ప సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుండటం, ఊరమాస్ లుక్ లో బన్నీ ఈ సినిమాలో కొత్తగా కనిపిస్తుండటం, ఇప్పటికే విడుదలైన పుష్పరాజ్ ఇంట్రడక్షన్ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు పుష్ప మూవీని కేజీఎఫ్ తో పోల్చడంతో బన్నీ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఆగష్టు 13వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ గతంలో ప్రకటించగా 45 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉండటంతో ఆ తేదీకి ఈ సినిమా రిలీజ్ కావడం కష్టమేనని తెలుస్తోంది. పుష్ప ఫస్ట్ పార్ట్ లో బన్నీ పూర్తిగా డీ గ్లామర్ లుక్ లో కనిపిస్తుండటం గమనార్హం. ఈ మూవీలో యాక్షన్ సన్నివేశాలు హైలెట్ గా ఉండబోతున్నాయని నిర్మాతలు ఆరు నిమిషాల యాక్షన్ సీన్ కోసం ఏకంగా ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు సమాచారం.

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో శేషాచలం అడవుల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. రంగస్థలం తర్వాత సుకుమార్ డైరెక్షన్ లో తెరకెకుతున్న సినిమా ఇదే కావడం గమనార్హం. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా రష్మిక మందన్నా ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో నటిస్తున్నారు. తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో, హిందీలో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. ఈ సినిమాను 2021 సంవత్సరం డిసెంబర్ 24వ తేదీన రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే కేజీఎఫ్ ఛాప్టర్ 2 కూడా అదే సమయంలో విడుదల కానున్నట్టు వార్తలు వస్తుండగా బన్నీకి యశ్ తో పోటీ తప్పదని ప్రచారం జరుగుతోంది.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus