అల వైకుంఠపురములో, పుష్ప ది రైజ్ ఇండస్ట్రీ హిట్లు బన్నీ అభిమానులకు సంతోషాన్ని కలిగించడంతో పాటు అంచనాలకు మించిన హిట్లుగా నిలిచాయనే సంగతి తెలిసిందే. పుష్ప ది రైజ్ కు క్రిటిక్స్ నుంచి నెగిటివ్ రివ్యూలు రావడంతో ఈ సినిమా అబవ్ యావరేజ్ గా నిలవడం కష్టమని చాలామంది భావించగా ఈ సినిమాకు అంచనాలకు మించి కలెక్షన్లు రావడంతో పాటు ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో అభిమానులు సైతం షాకయ్యారు.
అయితే పుష్ప ది రైజ్ మూవీ రీరిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళలో బన్నీకి ఊహించని రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కేరళలో బన్నీని మల్లూ అర్జున్ అని పిలుస్తారనే సంగతి తెలిసిందే. కేరళలో ఈ సినిమా రీరిలీజ్ కానుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 17వ తేదీన పుష్ప సినిమా కేరళలో రీరిలీజ్ కానుందని తెలుస్తోంది. డిసెంబర్ 17వ తేదీ నాటికి సినిమా విడుదలై ఏడాది కావడంతో ఈ సినిమాను రీరిలీజ్ చేస్తున్నట్టు సమాచారం.
తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాను రీరిలీజ్ చేస్తే బాగుంటుందని అభిమానులు భావిస్తుండగా ఈ సినిమా రీ రిలీజ్ కు సంబంధించి మేకర్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. పుష్ప ది రైజ్ ఆ సినిమా నిర్మాతలకు భారీ లాభాలను అందించిన సంగతి తెలిసిందే. పుష్ప ది రైజ్ హిందీ డిస్ట్రిబ్యూటర్ కు ఆ సినిమా ద్వారా అంచనాలకు మించి లాభాలు వచ్చాయి.
పుష్ప ది రూల్ రెగ్యులర్ షూట్ త్వరలో మొదలుకానుండగా ఈ సినిమాకు భారీ రేంజ్ లో బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయి. సుకుమార్ ఈ సినిమాకు పూర్తిస్థాయిలో పరిమితమయ్యారు. బన్నీ, సుకుమార్ పుష్ప ది రూల్ సినిమాకు కెరీర్ హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకోనున్నారు.