Pushpa Release Date: బన్నీ సినిమా ముందుగానే వస్తుందా..?

ఈ ఏడాది ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రాల్లో ‘పుష్ప’ ఒకటి. అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ తెరకెక్కుతోన్న ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ముందుగా ఫస్ట్ పార్ట్ ను ‘పుష్ప ది రైజ్’ పేరుతో క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. క్రిస్మస్ రిలీజ్ అనగానే.. డిసెంబర్ 25న వస్తుందనే అందరూ అనుకున్నారు. కానీ ‘పుష్ప’ టీమ్ ఆలోచన మరో రకంగా ఉంది.

క్రిస్మస్ సమయానికి సినిమా థియేటర్లలో ఉంటుంది కానీ.. అంతకంటే ముందు నుంచే సందడి చేయబోతున్నట్లు సమాచారం. క్రిస్మస్ పండగకి వారం ముందే ‘పుష్ప’ సినిమాను రిలీజ్ చేయనున్నారట. డిసెంబర్ 17కి ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 25న బాలీవుడ్ లో అమీర్ ఖాన్ నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ కూడా రిలీజ్ కాబోతుంది. ఆ సినిమాతో పోటీ పడి ‘పుష్ప’ కలెక్షన్స్ రాబట్టడం చాలా కష్టం.

నిజానికి బాలీవుడ్ లో కూడా ‘పుష్ప’ సినిమాపై అంచనాలు ఉన్నాయి. కానీ అమీర్ ఖాన్ తో పోటీ కరెక్ట్ కాదని.. వారం రోజుల ముందే ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారట. దీని వలన వారం రోజుల పాటు సోలోగా కలెక్షన్స్ వసూలు చేసుకోవచ్చని భావిస్తున్నారు. సినిమాకి మంచి టాక్ వస్తే.. లాంగ్ రన్ ఉంటుంది. క్రిస్మస్ వీకెండ్ తో పాటు డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో కూడా మంచి కలెక్షన్స్ వస్తాయి. అందుకే డిసెంబర్ 17న రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus