సుకుమార్, బన్నీలపై కరోనా దెబ్బ!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ‘పుష్ప’ సినిమా షూటింగ్ అర్థాంతరంగా క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. యూనిట్ లో దాదాపు డజను మంది వరకు కరోనా వచ్చినట్లు తెలుస్తోంది. కరోనా మాత్రమే కాకుండా వేరే సమస్యతో ఓ యూనిట్ మెంబర్ కు ప్రాణాల మీదకు వచ్చినట్లు సమాచారం. దీంతో ఉన్నట్టుండి షూటింగ్ ని క్యాన్సిల్ చేసి యూనిట్ మొత్తం మారేడుమిల్లి నుండి వెనక్కి తిరిగి వచ్చేసినట్లు తెలుస్తోంది.

నిజానికి కరోనా కాలంలో వీలైనంత తక్కువమందితో షూటింగ్ చేయాల్సివుంది. కానీ దాదాపు తొమ్మిది నెలల తరువాత సినిమా షూటింగ్ జరగడం, అది కూడా రంపచోడవరం, మారేడుమిల్లి ప్రాంతాల్లో చేస్తుండడంతో అక్కడ హడావిడి మాములుగా లేదు. ఈ సినిమా షూటింగ్ అక్కడ ఒక జాతర మాదిరి జరుగుతోంది. పైగా సినిమా కోసం దాదాపు ఎనిమిది వందల మందికి పైగా సిబ్బంది పని చేస్తున్నారట. షూటింగ్ స్పాట్ లో కనీసం కిలోమీటర్ వరకు ప్రొడక్షన్ టీమ్ వాహనాలే ఉంటున్నాయట.

ఈ సినిమా కోసం రోజులు నలభై నుండి యాభై లక్షల వరకు ఖర్చు చేస్తున్నారని టాక్. నిజానికి ఇక్కడ ఒక షెడ్యూల్ మాత్రమే చేయాలనుకున్న సుకుమార్.. ఫారెస్ట్ లుక్ నచ్చడంతో మరో షెడ్యూల్ ని కూడా ఇక్కడే చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. కానీ ఇప్పుడు సడెన్ గా కరోనా దెబ్బకి షూటింగ్ ని క్యాన్సిల్ చేసుకోవాలని వచ్చింది. మరి తిరిగి ఎప్పుడు మొదలుపెడతారో చూడాలి!

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus