Pushpa: పుష్ప2 మూవీ రిలీజయ్యేది అప్పుడే.. బాక్సాఫీస్ ను రూల్ చేయనున్నారా?

బన్నీ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప ది రైజ్ సినిమా కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించింది. పుష్ప ది రైజ్ హిందీ వెర్షన్ కు ఏకంగా 100 కోట్ల రూపాయల కంటే గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. పుష్ప ది రైజ్ సినిమాలో బన్నీ నటన అద్భుతంగా ఉండగా ఈ సినిమాలోని నటనకు బన్నీకి నేషనల్ అవార్డ్ రావడంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. బన్నీ కష్టానికి తగ్గ ఫలితం దక్కిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాకు మ్యూజిక్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ కు కూడా అవార్డ్ రావడం గమనార్హం. పుష్ప ది రైజ్ సినిమాలో ప్రతి పాట సూపర్ హిట్ కావడంతో దేవిశ్రీ ప్రసాద్ కు అవార్డ్ దక్కడం రైట్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పుష్ప2 మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందని తెలుస్తోంది. 2024 సంవత్సరం మార్చి నెల 22వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది.

బన్నీ హీరోగా నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సమ్మర్ కానుకగా విడుదలై బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. పుష్ప ది రూల్ మూవీ కూడా అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పండుగలు ఎక్కువగా ఉన్న డేట్ కావడంతో ఆ తేదీన ఈ సినిమా విడుదలైతే మాత్రం బాక్సాఫీస్ వద్ద భారీ రేంజ్ లో ఈ సినిమాకు కలెక్షన్లు వచ్చే అవకాశం అయితే ఉంది.

(Pushpa) పుష్ప ది రూల్, దేవర సినిమాలు రెండు వారాల గ్యాప్ లో థియేటర్లలో విడుదల కానున్నాయి. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బన్నీ ఎన్టీఆర్ మధ్య మంచి అనుబంధం ఉంది. భవిష్యత్తులో ఈ ఇద్దరు హీరోలు కలిసి నటిస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ హీరోల మార్కెట్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus