Pushpaka Vimanam Collections: పాజిటివ్ టాక్ వచ్చినా క్యాష్ చేసుకోలేకపోయిన ‘పుష్పక విమానం’

  • November 13, 2021 / 06:29 PM IST

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన ‘పుష్పక విమానం’ నిన్న రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ ను రాబట్టుకుంది. ఈ చిత్రం టీజర్, ట్రైలర్ లు కూడా ప్రామిసింగ్ గానే ఉన్నాయి. గీత్ సైని, శాన్వీ మేఘన నాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని దామోదర దర్శకత్వం వహించగా… ‘కింగ్ అఫ్ ది హిల్’ ఎంటర్ టైన్మెంట్స్ , ‘టాంగా ప్రొడక్షన్స్’ బ్యానర్ల పై గోవర్ధన్ రావు దేవరకొండ,విజయ్ మట్టపల్లి ,ప్రదీప్ ఎర్రబెల్లి లు నిర్మించారు. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం పెద్దగా జోరు చూపించలేకపోతుంది.

ఒకసారి మొదటి రోజు కలెక్షన్లను గమనిస్తే :

నైజాం  0.13 cr
సీడెడ్  0.09 cr
ఆంధ్రా(టోటల్)  0.14 cr
ఏపి+తెలంగాణ (టోటల్)  0.36 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా+
ఓవర్సీస్
 0.09 cr
వరల్డ్ వైడ్ టోటల్  0.45 cr

‘పుష్పక విమానం’ చిత్రానికి రూ.2.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.2.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది.కానీ మొదటి రోజు ఈ చిత్రం రూ.0.45 కోట్లు షేర్ ను మాత్రమే రాబట్టింది. రెండో రోజు కూడా బుకింగ్స్ పెద్దగా ఆశాజనకంగా లేవు. వీకెండ్ బాగా రాబడితే తప్ప బ్రేక్ ఈవెన్ సాధ్యం కాదు. పోటీగా మరో రెండు చిత్రాలు కూడా ఉండడం ‘పుష్పక విమానం’ కల్లెక్షన్లకి బ్రేకులు పడినట్టు అయ్యింది.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus