నిన్న విడుదలైన “మహానటి” సినిమా అఖండ విజయం సాధించే దిశగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. సినిమా చూసినవాళ్ళందరూ “మహాద్భుతం, క్లాసిక్” అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తుండడంతో లాంగ్ రన్ లో ఈ చిత్రం ఇప్పటివరకూ విడుదలైన సమ్మర్ రిలీజస్ కంటే ఎక్కువ కలెక్ట్ చేసే స్థాయి విజయం సాధించడం ఖాయమని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. అయితే.. ఈ సినిమాలో విజయానికి ఆనందపడుతూనే, సినిమాలో తన సన్నివేశం తొలగించబడినందుకు బాధపడుతోంది బిందు చంద్రమౌళి అనే ఆర్టిస్ట్.
“మహానటి” చిత్రంలో జెమిని గణేషన్ రెండో భార్య పుష్పవల్లిగా నటించింది బిందు చంద్రమౌళి. రెండు సన్నివేశాలతోపాటు కొన్ని మాంటేజ్ షాట్స్ కూడా తీశారట. అయితే.. లెంగ్త్ ఎక్కువయ్యిందన్న కారణంతో పుష్పవల్లిగా బిందు చంద్రమౌళి నటించిన సన్నివేశాలను తొలగించారు. ఈ విషయం సినిమా విడుదలయ్యాక తెలుసుకొన్న బిందు బాధపడడం తప్ప ఏమీ చేయలేకపోయింది. అయితే.. జెమిని గణేషన్ జీవితంలో ముఖ్యమైన మనిషి కావడంతోపాటు.. బాలీవుడ్ నటి రేఖ తల్లి అయిన పుష్పవల్లి పాత్రను ఎందుకు కట్ చేశారని అడుగుతున్నవాళ్లూ ఉన్నారు. ఆన్ లైన్ లేదా తదనంతరం ఈ సీన్స్ ను యాడ్ చేస్తే బాగుండు.