బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించిన సూపర్ హిట్ ‘క్వీన్’ చిత్రాన్ని తెలుగుతో పాటు పలు భాషల్లోకి రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘క్వీన్’ తెలుగు రీమేక్ రీమేక్ ‘దటీజ్ మహాలక్ష్మి’ పేరుతో రూపొందుతుండగా.. తమన్నా టైటిల్ రోల్ పోషిస్తుంది. ఇక తమిళ్ లో ‘పారిస్ పారిస్’ పేరుతో తెరకెక్కిస్తుండగా కాజల్ టైటిల్ రోల్ లో నటిస్తుంది. తాజాగా ఈ చిత్ర ప్రమోషన్లని మొదలు పెట్టింది చిత్ర యూనిట్.
ఇక్కడి వరకు బాగానే ఉంది. అయితే మన స్ట్రెయిట్ సినిమాలని ఇతర భాషల్లో ప్రమోట్ చేస్తే.. మంచి కలెక్షన్లు రావడంతో పాటు మంచి మార్కెట్ ఏర్పడుతుందనడంలో సందేహం లేదు. అయితే తెలుగులో నటిస్తున్న తమన్నా, తమిళంలో నటిస్తున్న కాజల్ అగర్వాల్, కన్నడ లో నటిస్తున్న పారుల్ యాదవ్, మలయాళం లో మంజిమా మోహన్ తాజాగా ముంబై మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. బాలీవుడ్ ప్రేక్షకులు కంగనా రనౌత్‌ని తప్ప మరొకర్ని ‘క్వీన్’గా ఊహించుకోలేనంత అద్భుతంగా నటించింది. ఇప్పటికే చాలా మంది హిందీ ప్రేక్షకులు ‘క్వీన్’ చిత్రాన్ని చూసేసారు. ఇలాంటి పరిస్థితుల్లో దక్షిణాది ‘క్వీన్’ రీమేక్స్ గురించి హిందీలో పబ్లిసిటీ చేయడం వల్ల ఉపయోగం వుంటుందా అనేది ఫిలిం విశ్లేషకుల ప్రశ్న? కాజల్, తమన్నా కలిసి తెలుగు, తమిళ మీడియాకు స్పెషల్ ఇంటర్వ్యూలు ఇస్తే ఉపయోగం ఉంటుంది కానీ.. హిందీలో ఇంటర్వ్యూలు ఇవ్వడం ఏమిటో అంటూ సోషల్ మీడియాలో కొందరు కామెంట్లు పెడుతున్నారు..! మరి తెలుగు,తమిళ భాషల్లో చిత్ర బృందం ఎలాంటి ప్రమోషన్లు చేస్తుందో చూడాలి..!