ఇటీవల వచ్చిన ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘అయ్యప్పనుమ్ కొశియమ్’ రీమేక్ సినిమాల మేకింగ్ వీడియోలను పరిశీలిస్తే… మనకు రెండు డిఫరెంట్ విషయాలు కనిపిస్తాయి. ‘ఆర్‌ఆర్‌ఆర్’ మేకింగ్ వీడియోలో ఎక్కువ ఫ్రేమ్స్‌లో దర్శకుడు రాజమౌళి కనిపించాడు. ఇక ‘ఏకే రీమేక్’లో ఎక్కువగా కనిపించింది త్రివిక్రమ్ శ్రీనివాస్. తప్పేముంది ఆయన దర్శకుడే కదా అంటారా. అయితే ఆయన ఆ సినిమా దర్శకుడికే కంటే ఎక్కువగా కనిపించారు. అదీ మేటర్. ‘అయ్యప్పనుమ్ కొశియమ్’ రీమేక్ చేస్తున్నారు అని టాక్ వచ్చినప్పుడు సినిమాకు దర్శకుడు ఎవరు అనేది తెలియలేదు.
ఎవరో ఆ సినిమా పనిలో ఉన్నారు అని మాత్రమే చెప్పారు. కొన్నాళ్లకు హీరోల పేర్లు వచ్చాయి, వెళ్లాయి. ఆఖరి పవన్ కల్యాణ్ పేరు ఫిక్స్ అయ్యింది. ఆ వెంటనే దర్శకుడి సాగర్ చంద్ర అని చెప్పారు. ఇక్కడి దాకా అంతా బాగానే ఉంది. కానీ సెట్స్‌లో పరిస్థితి అలా లేదట. ఈ మాట ఎవరో చెప్పడం కాదు. మేకింగ్ వీడియోలోనే తెలిసిపోతోంది. పవన్ కల్యాణ్‌ను మెయిన్‌గా చేసుకొని మేకింగ్ వీడియోను ఇటీవల విడుదల చేశారు. అయితే ఆ వీడియోలో సీన్స్ చెబుతున్నది, చేయిస్తున్నది సాగర్ చంద్ర కాకుండా…
త్రివిక్రమ్ అనే తెలుస్తోంది. స్క్రీన్ ప్లే, మాటల రచయిత అయితే సెట్స్‌లో ఉండొచ్చు. కానీ డైరక్షన్ చేయాల్సిన సమయంలో కూడా అక్కడే ఉంటే ఏమనాలి. అలాంటప్పుడు దర్శకత్వ పర్యవేక్షణ అనో, సూపర్ డైరక్టర్ అనో పేరు పెట్టుకుంటే బాగుండేది.