టాలీవుడ్ లో సినిమా నిర్మించడం అంటే….కోట్లు విసిరేసీ….చిల్లర వేరుకోవడం లాంటింది అని చెప్పక తప్పదు…ఎందుకంటే సినిమా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో జూదంలా తయారయింది….అంటే మా ఉద్దేశం సినిమాని తక్కువ చేసి మాట్లాడటం కాదు….పెట్టిన పెట్టుబడి అయినా తిరిగి వస్తుందా అనే ఇన్ అండ్ ఔట్ గేమ్ లా అయిపోయింది సినిమా పరిస్థితి…అయితే అదే క్రమంలో చిన్న సినిమాలకు ఇబ్బందులు ఎప్పటికప్పుడు ఉంటూనే ఉన్నాయి..విషయంలోకి వెళితే….సంక్రాంతి బరిలో నిలిచిన ఒక సినిమాకు న్యాయం జరగలేదు అంటూ వాపోతున్నాడు ఒక నిర్మాత కమ్ దర్శకుడు….ఒక పక్క బాలయ్య, మరోపక్క చిరు, ఇంకో పక్క శర్వానంద్ ముగ్గురూ బాక్స్ ఆఫీస్ ను తమ తమ బలాబలాలతో దున్నుకుంటున్న వేళ…ఒక నిర్మాతకు సినిమా విడుదల చేసుకోవడానికి థియేటర్స్ దొరకకపోవడం చాలా విచారకరం….అనే చెప్పాలి… ‘హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య’ ఎన్నో ఆశలతో సంక్రాంతి బరిలో నిలిచాడు…అయితే ఈ చిత్రానికి తెలంగాణ వరకు 23 థియేటర్లిచ్చారట. ఆంధ్రప్రదేశ్ లో ఒక్కటంటే ఒక్క థియేటర్ కూడా ఇవ్వలేదంటూ ప్రెస్ మీట్ పెట్టి మరోసారి వాపోయాడు నారాయణమూర్తి.
13 జిల్లాల్లో ఒక్కటంటే ఒక్క థియేటర్ కూడా ఇవ్వకపోవడం అన్నది కచ్చితంగా ఆవేదన కలిగించే విషయమే. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జోక్యం చేసుకుని చిన్న సినిమాలకు థియేటర్లిచ్చే విషయమై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నారాయణమూర్తి. ఆయన వేదన అర్థం చేసుకోదగ్గదే. అయితే ఇక్కడ మనం కాస్త ఆలోచించాల్సిన మరొక విషయం ఏంటి అంటే……అసలే సంక్రాంతికి క్రేజీ సినిమాలు రిలీజవుతున్నాయని.. జనాల ఫోకస్ అంతా వాటి మీదే ఉందని తెలిసినా.. ప్రతిష్టకు పోయిన ఈ సినిమాను రిలీజ్ చేయడం కరెక్టా అన్నది నారాయణ మూర్తి గారు ఎందుకు ఆలోచించలేదో ఆయనకే తెలియాలి….ఏది ఏమైనా..భారీగా ఖర్చుపెట్టి తీసిన సినిమా రిలీజ్ కాకపోతే ఆ నిర్మాతకు ఇబ్బందులు ….
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.