నితిన్ కి జోడీగా నటించనున్న రాశీ ఖన్నా

సాయి పల్లవి, రాశీ ఖన్నా.. ఇద్దరూ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఫిదా, ఎంసీఏ సినిమాలతో సాయి పల్లవి మంచి హిట్స్ అందుకుంది. ఆమె కంటే ముందు టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన రాశీ ఖన్నా యువ హీరోలతో హిట్స్ కొట్టి స్టార్ హీరోలతోనూ జత కడుతోంది. రీసెంట్ గా ఆమె నటించిన జై లవకుశ, తొలి ప్రేమ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. సో తమ సినిమాల్లో వీరు నటించాలని దర్శకనిర్మాతలు కోరుకుంటున్నారు. లై తో అపజయాన్ని చూసిన నితిన్ ప్రస్తుతం కృష్ణ చైతన్య దర్శకత్వంలో చల్ మోహన్ రంగ సినిమా చేస్తున్నారు. మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన టిజర్ కు మంచి స్పందన వచ్చింది. ఈ మూవీ ఏప్రిల్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

దీని తర్వాత నితిన్ శ్రీనివాస కళ్యాణం సినిమాను మొదలుపెట్టనున్నారు. సతీష్ వేగ్నేష్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఆయన గత చిత్రాలైన ఫిదా, ఎంసీఏలలో హీరోయిన్ గా నటించిన సాయి పల్లవిని ఇందులో హీరోయిన్ గా అనుకున్నారు. మొదటి సినిమా ఒప్పుకున్నప్పుడే దిల్ రాజు బ్యానర్లో మూడు సినిమాలు చేస్తానని సాయి పల్లవి కూడా సైన్ చేసింది. మరి ఏమైందో తెలియదు కానీ.. సాయి పల్లవి ఈ సినిమా నుంచి బయటికి వెళ్ళింది. ఆ స్థానంలో ఢిల్లీ బ్యూటీ రాశిఖన్నా చేరింది. మిక్కి జే మేయర్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా “ఎక్కడికి పోతావు చిన్నవాడ” ఫేమ్ నందితా శ్వేతా నటిస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus