Raashi Khanna: రాశీ ఖన్నా కు కాబోయే వరుడు అతడేనా..!

రాశి ఖన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. “ఊహలు గుసగుసలాడే” సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. తాను నటించిన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన క్యూట్ లుక్స్, ఎక్స్ప్రెషన్స్ తో ప్రేక్షకులను ఫిదా చేసింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ భాషల్లో కూడా సినిమాలు చేసింది. తాను చాలా సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. దాదాపు ఎన్టీఆర్, నాగచైతన్య వంటి స్టార్ హీరోల సరసన నటించినప్పటికీ గుర్తింపును సంపాదించుకోలేకపోయింది.

ఆ తర్వాత సినిమాల కు కాస్త దూరంగా ఉంది (Raashi Khanna) రాశిఖన్నా. ఎప్పుడో ఒకసారి తప్పితే పెద్దగా సినిమాలు చేసేది కాదు. ఎందుకంటే తాను కాస్త లావుగా ఉండడంతో సినిమా అవకాశాలు పెద్దగా వచ్చేవి కాదట. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాశి ఖన్నా ఆసక్తికరమైన కామెంట్లు చేసింది.తాను ఒకప్పుడు ఒక వ్యక్తిని ప్రేమించి బ్రేకప్ అవడం వల్ల డిప్రెషన్ లోకి వెళ్లడంతో చాలా బరువు పెరిగానని వెల్లడించింది. ‘‘ఇక ఆ తర్వాత కొన్ని రోజులకి మరో వ్యక్తి పరిచయమయ్యాడు.

మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ గా ఉన్నాము. తాను నాకు చాలా సపోర్ట్ చేశాడు. ఆ సమయంలో మేమిద్దరం ప్రేమలో పడ్డాము. తనతో డేటింగ్ చేయడం కూడా స్టార్ట్ చేశాను. తనతో డేటింగ్ వల్ల డిప్రెషన్ నుంచి బయటకు వచ్చా. అందువల్లనే బరువు కూడా చాలా తగ్గాను’’ అని చెప్పుకొచ్చింది. కానీ ఆ వ్యక్తి ఎవరు ఇండస్ట్రీకి చెందిన వ్యక్తా…..

లేదంటే బయట వ్యక్తా…. అనే విషయాన్ని రాశి ఖన్నా ప్రకటించలేదు దీంతో రాశి ఖన్నానీ పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరా అంటూ ప్రేక్షకులు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఇక త్వరలోనే రాశి పెళ్లి పీటలు ఎక్కబోతుందని తన ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus