సుకుమార్-చరణ్ సినిమాలో రాశి ఖన్నా

‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన రాశిఖన్నా ఇప్పటివరకు చేసిన సినిమాలన్నింటిలోను మోడర్న్ అమ్మాయిగానే కనపడింది. ఇంకా చెప్పాలంటే తెలుగు సినిమాకి సరిపడా గ్లామర్ డాల్ తరహా పాత్రలతోనే ప్రేక్షకులకు చేరువైంది. ‘హైపర్’ తో హిట్ కొట్టిన భామ తమిళంలో రెండు సినిమాలు చేస్తుంది. తెలుగులో మాత్రం ఒక్క ఛాన్స్ కూడా చేతిలో లేదు. అయితే ప్రస్తుతం ఓ పెద్ద సినిమాలో నాయికగా రాశి పేరు పరిశీలిస్తున్నారు. కాకపోతే ఈ పాత్ర కోసం కాస్త కట్టు, బొట్టు మారాలట.

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా మొదలవనుంది. పూర్తిస్థాయి ప్రేమకథగా ఈ సినిమా తెరకెక్కించనున్నారు సుక్కు మాస్టర్. పీరియాడిక్ డ్రామాగా ప్రచారంలో ఉన్న ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు రాశి ఖన్నాని సంప్రదిస్తున్నారట దర్శక నిర్మాతలు. ఈ మేరకు రామ్ చరణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వినికిడి. సినిమా విషయంలో సుక్కు ఎంత శ్రద్ధ తీసుకుంటారో తెలిసిందే. సెల్ ఫోన్లు లేని కాలంలో స్వచ్ఛమైన ప్రేమకథ చూపించాలని తపిస్తున్న సుకుమార్ ఈ సినిమాలో హీరోయిన్ అచ్చమైన తెలుగింటి గ్రామీణ పడుచుగా ఉండాలని ఫిక్స్ చేశారు. కాసేపైనా ‘100% లవ్’ లో తమన్నాతో లంగా-వోణీ కట్టించి పల్లెతనం కనబరిచిన సుకుమార్ ఊహలకు తగిన విధంగా రాశి తనని తాను మార్చుకుంటుందా లేదా అన్నది అనుమానంగా ఉంది. చూద్దాం ఏమవుతుందో..!

https://www.youtube.com/watch?v=f1h0lrHMErI

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus