అప్పుడేమో పద్దతిగా.. ఇప్పుడు హాట్ హాట్ గా..!

కరోనా కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ టైం నుండీ ఇప్పటివరకూ వరుస ఫోటో షూట్లలో పాల్గొంటూ వస్తోంది రాశీ ఖన్నా. ఆ టైములో సినిమా షూటింగ్లు లేక ఖాళీగా ఉండడంతో ఈమెకు ఫోటో షూట్ల పై మక్కువ ఏర్పడినట్టు స్పష్టమవుతుంది. అప్పుడప్పుడు లంగా వోణిలో లేదా పొట్టి పొట్టి డ్రెస్సులలో ఈమె ఫోటో షూట్లు చేసింది. ఓ సారి సాగరకన్యలా మారిపోయి ఈమె పాల్గొన్న ఫోటో షూట్.. అలాగే ‘రంగస్థలం’ లో రామలక్ష్మీ మాదిరి పాల్గొన్న ఓ ఫోటో షూట్ హైలెట్ గా నిలిచిందని చెప్పొచ్చు.

నెట్టింట్లో ఈ ఫోటోలు పెద్ద ఎత్తున సందడి చేసాయి. అయితే వాటికి మించి ఇప్పుడు రాశీ ఖన్నా ఫోటో షూట్లలో పాల్గొంటుంది. మొన్నటికి మొన్న బికినీలో కూడా మెరిసింది ఈ బ్యూటీ.దాంతో ఈమె అభిమానులు షాక్ కు గురయ్యారు. అయితే ఇవన్నీ మ్యాగజైన్ కవర్ పేజీల కోసమే కదా అని వారు భావించారు.గతవారం మళ్ళీ ఈమె సంప్రదాయంగా లంగా వోణి ధరించి అభిమానులను ఆకర్షించింది.కానీ ఆ ఫీల్ లో ఉండగానే ఇప్పుడు మరో ఫోటోతో కుర్ర కారు మతులు పోగొడుతుంది.

బ్లాక్ డ్రెస్ లో ఉన్న రాశీ యమ హాట్ గా కుర్చీలో బద్దకంగా కూర్చొని ఫోజులిచ్చింది. ఇంత తొందరగా ఈమెలో ఇంత మార్పు ఏంటా అని కామెంట్లు చేస్తూ నెటిజన్లు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం గోపీచంద్ హీరోగా మారుతీ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ‘పక్కా కమర్షియల్’ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది రాశీ.


1

2

3

4

5

6

7

More..

1

2

3

4

5

6

7

8

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus