Raashi Khanna: రాశీ ఖన్నా డ్రీం రోల్ ఏంటో తెలుసా?

టాలీవుడ్ హీరోయిన్ రాశీ ఖన్నా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘మనం’ తో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ తర్వాత ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో హీరోయిన్ గా మారింది. ఈమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 10 ఏళ్ళు పూర్తి కావస్తోంది. అయినా స్టార్ హీరోయిన్ ఇమేజ్ కు కొద్ది దూరంలో ఆగిపోయింది.గత ఏడాది ఈమె నుండి వచ్చిన ‘థాంక్యూ’ ‘పక్కా కమర్షియల్’ వంటి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయితే తమిళంలో చేసిన రెండు సినిమాలు బాగానే ఆడాయి కానీ వాటి వల్ల ఈమెకు కలిసొచ్చింది ఏమీ లేదు.

‘రుద్ర’ సిరీస్ తో ఓటీటీకి కూడా ఎంట్రీ ఇచ్చింది. అలాగే ‘ఫర్జీ’ లో కూడా లీడ్ రోల్ పోషించింది.’ఫ్యామిలీ మెన్2′ డైరెక్టర్లు అయిన రాజ్ అండ్ డీకేలు డైరెక్ట్ చేసిన ఈ సిరీస్లో షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి, రెజీనా వంటి స్టార్స్ నటించారు. ఫిబ్రవరి 10 నుండి ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్ ప్రమోషన్లో భాగంగా రాశీ ఖన్నా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.

ఈ క్రమంలో ఆమెకు ఓ ప్రశ్న ఎదురైంది. ‘ఈ మధ్య కాలంలో మీరు ఎక్కువగా సినిమాలు చేయడం లేదు. పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యారు కాబట్టే సినిమాలకు దూరంగా ఉంటున్నారా?’ అంటూ యాంకర్ ప్రశ్నించారు. ఇందుకు రాశీ ఖన్నా బదులిస్తూ.. ‘అందులో ఎలాంటి నిజం లేదు. తెలుగులో 3, తమిళంలో 3 కథలు విన్నాను. సినిమాలకు నేను బ్రేక్ ఇవ్వలేదు’ అని తెలిపింది.

అలాగే మీ డ్రీమ్ రోల్ ఏంటి? అని రాశీ ఖన్నాని ప్రశ్నించగా.. నేను లవ్ స్టోరీస్ లో నటించాను. కామెడీ రోల్స్ కూడా చేశాను. ఇప్పుడు యాక్షన్ రోల్స్ చేయాలని ఉంది. అందులో కూడా హుందాతనం ఉండాలి. ‘బాహుబలి’ లో అనుష్క చేసిన దేవసేన పాత్ర లాంటిది చేయాలని ఉంది.’ అంటూ రాశీ ఖన్నా చెప్పుకొచ్చింది.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus