Racha Collections: ‘రచ్చ’ కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

మెగా పవర్ స్టార్ రాంచరణ్ (Ram Charan) హీరోగా సంపత్ నంది (Sampath Nandi) దర్శకత్వంలో రూపొందిన మాస్ ఎంటర్టైనర్ ‘రచ్చ’ (Racha). ‘మెగా సూపర్ గుడ్ ఫిలింస్’ బ్యానర్ పై ఆర్.బి.చౌదరి (Ratanlal Bhagatram Choudary), పరాస్ జైన్, ఎన్వీ ప్రసాద్..లు ఈ సినిమాను నిర్మించారు. 2012 ఏప్రిల్ 5న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ‘ఏమైంది ఈ వేళ’ అనే ఒక్క క్లాస్ సినిమాని మాత్రమే డైరెక్ట్ చేసిన సంపత్ నందిపై ముందుగా ఎవ్వరికీ నమ్మకం లేదు.కానీ మొదటి షోతో ‘రచ్చ’ హిట్ టాక్ తెచ్చుకుంది.

Racha Collections:

రొటీన్ స్టోరీనే అయినప్పటికీ చరణ్ ను సంపత్ ప్రజెంట్ చేసిన తీరు అందరికీ నచ్చింది. మణిశర్మ (Mani Sharma) సంగీతం కూడా సినిమాకి హైలెట్ గా నిలిచింది. చిరంజీవి (Chiranjeevi) సూపర్ హిట్ మూవీ ‘గ్యాంగ్ లీడర్’ (Gangleader) లోని ‘వాన వాన’ పాటని ఈ సినిమాలో రీమిక్స్ చేశారు. నేటితో ఈ చిత్రం విడుదలై 13 ఏళ్లు పూర్తి కావస్తోంది. ఈ సందర్భంగా ‘రచ్చ’ క్లోజింగ్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 11.60 cr
సీడెడ్  8.25 cr
ఉత్తరాంధ్ర  4.40 cr
ఈస్ట్  2.92 cr
వెస్ట్  2.46 cr
గుంటూరు  3.85 cr
కృష్ణా  2.50 cr
నెల్లూరు  2.05 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 38.03 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా  5.15 cr
తమిళ్ + మలయాళం  2.20 cr
ఓవర్సీస్  1.82 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 47.20 cr

‘రచ్చ’ చిత్రం రూ.38.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.47.20 కోట్ల షేర్ ను రాబట్టింది. బయ్యర్స్ కు రూ.7.5 కోట్ల లాభాలను అందించి సూపర్ హిట్ గా నిలిచింది ఈ సినిమా.

నిర్మాతల్ని ఏడిపించేస్తున్న పాన్ ఇండియా హీరో!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus