‘రాధేశ్యామ్’ చిత్ర దర్శకుడు రాధాకృష్ణ కుమార్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వేదికగా వైరల్ అవుతోంది. ఇది చాలా కఠినమైన సమయమని.. మన చేతిలో ఏది లేదంటూ ఆయన చేసిన ట్వీట్ కి అర్ధమేంటంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ఈ ఏడాది సంక్రాంతికి ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ లాంటి సినిమా విడుదలవుతాయని అనౌన్స్ చేశారు. జనవరి 7న విడుదలవుతుందనుకున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా వాయిదా పడింది. దాని రూట్ లోనే ‘రాధేశ్యామ్’ కూడా వాయిదా పడుతుందని అందరూ అనుకున్నారు.
కానీ అందులో నిజం లేదని సంక్రాంతికి ‘రాధేశ్యామ్’ రావడం పక్కా అని చెప్పింది చిత్రబృందం. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. ‘ఆర్ఆర్ఆర్’ వాయిదా పడినా.. ‘రాధేశ్యామ్’ వస్తుందని సంతోష పడ్డారు. ఇలాంటి సమయంలో దర్శకుడు చేసిన ట్వీట్ ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతోంది. ఇంతకీ ఆయన పెట్టిన ట్వీట్ ఏంటంటే.. ‘సమయాలు కఠినమైనవి, హృదయాలు బలహీనంగా ఉన్నాయి, మనస్సులు అల్లకల్లోలంగా ఉన్నాయి. జీవితం మనపైకి ఏది విసిరినా.. మన ఆశలు ఎల్లప్పుడూ ఉన్నతంగా ఉంటాయి.
సురక్షితంగా ఉండండి, ఉన్నతంగా ఉండండి’ అంటూ రాసుకొచ్చారు. ఈ ట్వీట్ చూస్తుంటే సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఓ నెటిజన్ నేరుగా సినిమా వాయిదా పడుతుందా.. అన్న..? అని దర్శకుడిని ప్రశ్నించగా.. ‘అలాంటిదేమైనా ఉంటే డైరెక్ట్ గా, అఫీషియల్ గా చెప్తాము’ అంటూ బదులిచ్చాడు దర్శకుడు. మరోపక్క పది రోజుల్లో రిలీజ్ పెట్టుకొని ఇప్పటివరకు సరైన ప్రమోషన్స్ చేయలేదు ‘రాధేశ్యామ్’ టీమ్.ప్రభాస్ షెడ్యూల్ చేసిన మీడియా ఇంటర్వ్యూలు సైతం క్యాన్సిల్ చేసుకున్నాడు. మరి సినిమా చెప్పిన టైం కి వస్తుందో లేదో చూడాలి!
Most Recommended Video
ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!