రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ మార్చి 18వ తేదీ లేదా ఏప్రిల్ 28 తేదీన రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. కరోనా ఆంక్షలు, దేశవ్యాప్తంగా పరిస్థితులను బట్టి ఆర్ఆర్ఆర్ రిలీజ్ విషయంలో ఆర్ఆర్ఆర్ మేకర్స్ రిలీజ్ డేట్ ను ఎంపిక చేయనున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ వల్ల పెద్ద హీరోల సినిమాలను రిలీజ్ చేసే విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం గమనార్హం. రాధేశ్యామ్ మేకర్స్ ఆ సినిమాను మార్చి 18వ తేదీన విడుదల చేయాలని భావించగా ఆర్ఆర్ఆర్ టీమ్ అదే తేదీకి రిలీజ్ డేట్ ను ప్రకటించి షాకిచ్చింది.
ప్రస్తుతం రాధేశ్యామ్ మేకర్స్ కూడా ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ పై దృష్టి పెట్టారని బోగట్టా. ఆర్ఆర్ఆర్ మార్చి 18వ తేదీన విడుదలైతే తమ సినిమాను ఏప్రిల్ 28వ తేదీన విడుదల చేయాలని వాళ్లు భావిస్తున్నారు. ఒకవేళ ఆర్ఆర్ఆర్ మూవీ ఏప్రిల్ 28వ తేదీన రిలీజయ్యే అవకాశం ఉంటే రాధేశ్యామ్ మార్చి 18వ తేదీన రిలీజయ్యే ఛాన్స్ ఉంది. రాధేశ్యామ్ సినిమాకు ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయనే సంగతి తెలిసిందే.
కేవలం కరోనా ఆంక్షల వల్లే ఈ సినిమా విడుదల ఆలస్యమవుతోంది. రాధేశ్యామ్ ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో అంచనాలను పెంచింది. చాలా సంవత్సరాల తర్వాత ప్రభాస్ నటించిన క్లాస్ సినిమా రాధేశ్యామ్ కావడం గమనార్హం. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. రాధేశ్యామ్ సినిమాలో ప్రభాస్ కు జోడీగా పూజా హెగ్డే నటించారు. కృష్ణంరాజు ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుండగా 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది.
ప్రభాస్ ఫ్యాన్స్ కళ్లు కాయలు చేసేలా ఎదురుచూస్తున్న రాధేశ్యామ్ అంచనాలను మించి విజయాన్ని సొంతం చేసుకుంటుందేమో చూడాల్సి ఉంది. ఏప్రిల్ నెలాఖరు నాటికి రాధేశ్యామ్ కచ్చితంగా రిలీజయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
Most Recommended Video
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!