సినిమాల కోసం సెట్స్ వేయడం పెద్ద విషయమేమీ కాదు. రాజమౌళి లాంటి దర్శకులు వచ్చాక సెట్స్ అనేవి కామన్ అయిపోయాయి. అయితే అవి అచ్చంగా ఒరిజినల్‌లా ఉండటం గొప్పే. వెండితెర మీద చూసినప్పుడు అది సెట్ కాదు అనేలా సెట్స్ వేయాలి. తాజాగా ఓ సినిమా విషయంలో ఇది జరిగింది. ప్రభాస్ – రాధాకృష్ణ కాంబోలో వస్తున్న ‘రాధే శ్యామ్’ గురించే. గ్లింప్స్ పేరుతో ఇటీవల ఈ సినిమా కు సంబంధించిన డైలాగ్ వీడియోను విడుదల చేశారు. అందులో ఓ రైల్వే స్టేషన్‌లో వందలాది మంది ఆర్టిస్టులతో ఆ సీన్ తీశారు. ఆ మధ్య ‘రాధే శ్యామ్’ టీమ్ విదేశాలకు వెళ్లింది.. అక్కడే తీసుకుంటారేమో ఆ సీన్ అనుకున్నారంతా.
అయితే అన్నపూర్ణ స్టూడియస్ ఆ సీన్ ఫొటో షేర్ చేసి… వావ్ అనిపించింది. కారణంగా ఆ వీడియోలో మనం చూసిన రైల్వే స్టేషన్ ఒరిజినల్ కాదు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేసిన సెట్ అది. దీంతో అభిమానులు ఆ ట్వీట్ కింద తెగ చర్చించుకుంటున్నారు. ‘నిజం రైల్వే స్టేషన్ అనుకున్నాం. సెట్టా ’ అని చర్చించుకుంటున్నారు. ఇక్కడే చిత్రబృందం ఆలోచన గురించి కూడా చర్చ జరుగుతోంది. పాన్ ఇండియా రేంజీలో సినిమాను తెరకెక్కించాలని చిత్రబృందం బాగానే ఖర్చు పెడుతోందని చాలా రోజుల నుండి వార్తలొస్తున్నాయి. ఆ మధ్య వచ్చిన టీజర్ వీడియోలనూ ఆ ఖర్చు కనిపించింది.
మొత్తం విజువల్ ఎఫెక్ట్స్‌తోనే ఆ వీడియో రూపొందించారు. ఇప్పుడు గ్లింప్స్‌లో భారీ సెట్ వేశారు. ఇదంతా చూస్తుంటే సినిమాకు ఇంకెంత ఖర్చు పెట్టారో అర్థమవుతోంది. అయితే ఓ ప్రేమకథకు అంత ఖర్చు అవసరమా అనే ప్రశ్నలూ వినిపిస్తున్నాయి. పాన్ ఇండియా రేంజికి తీసుకెళ్లి సరైన విజయం అందుకోకపోతే ఏమవుతుందో.. ప్రభాస్‌కు ‘సాహో’తో తెలిసొచ్చింది. అయినా ఇప్పుడు ‘రాధే శ్యామ్’ విషయంలో అంతెందుకు ఖర్చు చేస్తున్నారో తెలియడం లేదు. ఏదైతే ఏముంది… మంచి సినిమా తీయాలి… అందరూ చూసి ఎంజాయ్ చేయాలి.
Most Recommended Video
కాపటధారి సినిమా రివ్యూ & రేటింగ్!
దృశ్యం 2 సినిమా రివ్యూ & రేటింగ్!
ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!