దక్షిణాది చిత్ర పరిశ్రమపై మరోసారి సంచలన కామెంట్స్ చేసిన రాధికా ఆప్టే.!

స్టార్ హీరోయిన్ హోదా లేకపోయినప్పటికీ రాధికా ఆప్టే (Radhika Apte) ఏది చెప్పినా సంచలనమే. ధోనీ, రక్తచరిత్ర, లెజెండ్‌, లయన్ చిత్రాలతో తెలుగు వారికి పరిచయమైన ఈ బ్యూటీ గతంలో తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్లని హీనంగా చూస్తారని చెప్పి పరిశ్రమకు దూరమైంది. అనంతరం దక్షిణాదికి చెందిన ఓ నిర్మాత తనను పడక గదిలోకి రమ్మని పిలిచాడని చెప్పి బ్రేకింగ్ న్యూస్ గా మారింది. కొన్ని రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆమె ఓ అగ్ర హీరో చెంప పగలగొట్టానని చెప్పి షాకిచ్చింది. తాజాగా దక్షిణాది చిత్ర పరిశ్రమపై  సంచలన కామెంట్స్ చేసింది. బాలీవుడ్‌ నటి నేహా ధుపియా హోస్ట్‌ చేస్తున్న ‘నో ఫిల్టర్’ చాట్‌ షోలో పాల్గొన్న రాధికా దక్షిణాది హీరోలను అభినందిస్తూనే చురకలు అంటించింది.

“నటిగా పరిశ్రమలోకి వచ్చినప్పుడు దక్షిణాది చిత్రాల్లో నటించాను. అది నాకు చాలా ఇబ్బందికరంగా అనిపించేది. పారితోషికం బాగానే ఇస్తారు కానీ అందుకు తగినట్లు చాలా కష్టపడాలి. నేను చేసిన సినిమాల్లో హీరోలకే ప్రాధాన్యత ఉండేది. దక్షిణాది హీరోలు చాలా పవర్‌ఫుల్‌. సెట్స్‌కు రెండు గంటల ముందుగానే రావాలి. హీరోలు వచ్చే వరకూ ఎదురుచూడాలి. కాస్త భిన్నంగా ట్రీట్‌ చేస్తుంటారు.” అని విమర్శలు చేశారు. ఈ మాటలు దక్షిణాది హీరోల అభిమానులను ఆగ్రహానికి గురిచేశాయి. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు. దక్షిణాది చిత్ర పరిశ్రమల వారు ఆమెకు అవకాశం ఇవ్వరని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus