Raghava Lawrence: అఖండ మూవీ గురించి లారెన్స్ కామెంట్స్ వింటే షాకవ్వాల్సిందే?

నటుడిగా, కొరియోగ్రాఫర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న రాఘవ లారెన్స్ నటించిన రుద్రుడు మరికొన్ని గంటల్లో విడుదల కానుంది. రుద్రుడు తెలుగు ట్రైలర్ కు ఏకంగా 6.3 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. మాస్ మసాలా యాక్షన్ మూవీగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు యాక్షన్ సీక్వెన్స్ లు హైలెట్ కానున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో లారెన్స్ కు జోడీగా ప్రియా భవానీ శంకర్ నటించారు.

ఈ సినిమాలో శరత్ కుమార్ కీలక పాత్రలో నటించడం గమనార్హం. తక్కువ మొత్తం టార్గెట్ తో విడుదలవుతున్న ఈ సినిమా సులువుగానే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లారెన్స్ మాట్లాడుతూ మదర్ సెంటిమెంట్ తో రుద్రుడు సినిమా తెరకెక్కిందని సినిమాలో మంచి మెసేజ్ ఉందని లారెన్స్ చెప్పుకొచ్చారు. ఐటీ జాబ్ చేసే మిడిల్ క్లాస్ కుర్రాడిగా ఈ సినిమాలో నేను కనిపిస్తానని ఆయన తెలిపారు.

ఈ సినిమాకు కతిరేసన్ ప్రొడ్యూసర్ అని ఆయనే సినిమాకు డైరెక్టర్ గా కూడా వ్యవహరించారని లారెన్స్ చెప్పుకొచ్చారు. మంచి కంటెంట్ తో ఈ సినిమా తెరకెక్కిందని ఆయన తెలిపారు. ఈ సినిమాలో మెలోడీ సాంగ్స్ కూడా ఉంటాయని మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ తో ఈ సినిమా తొలి సినిమా అని లారెన్స్ వెల్లడించారు. అఖండ సినిమాలో ఫైట్లు నాకు చాలా నచ్చాయని ఆయన చెప్పుకొచ్చారు.

అఖండ సినిమాలోని యాక్షన్ సీన్ల కోసమే మూడుసార్లు సినిమా చూడటం జరిగిందని (Raghava Lawrence) లారెన్స్ తెలిపారు. ప్రస్తుతం చంద్రముఖి2, జిగర్తాండా2 సినిమాలలో నటిస్తున్నానని ఆయన కామెంట్లు చేశారు. అఖండ సినిమాకు పని చేసిన ఫైట్ మాస్టర్ ఈ సినిమా కోసం పని చేశారని ఈ సినిమాలోని ప్రతి ఫైట్ లో ఎమోషన్ ఉందని లారెన్స్ చెప్పుకొచ్చారు. లారెన్స్ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus