Raghava Lawrence: ఆ ప్రేమను చాలా మిస్ అవుతున్నా.. లారెన్స్ ఎమోషనల్!

రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణం ఇండస్ట్రీని తీవ్ర విషాదంలోకి తోసి వేసింది.ఇండస్ట్రీలో సీనియర్ నటుడుగా కొనసాగుతున్నటువంటి ఈయన తుది శ్వాస వరకు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేశారు. ఇలా సినిమా రంగానికి అహర్నిశలు సేవ చేసిన కృష్ణంరాజు అనారోగ్య సమస్యలతో ఆదివారం తెల్లవారుజామున మరణించిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఈయన మరణ వార్త తెలుసుకున్న ఎంతోమంది సెలబ్రిటీలు రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయనకు నివాళులు అర్పించారు.

ఈ క్రమంలోనే నటుడు దర్శకుడు డాన్స్ మాస్టర్ లారెన్స్ కృష్ణంరాజు మృతి పై స్పందిస్తూ ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఆయనకు చివరిసారిగా కృష్ణంరాజు గారిని చూసుకునే అదృష్టం లేదంటూ ఎమోషనల్ అయ్యారు. లారెన్స్ దర్శకత్వంలో ప్రభాస్ కృష్ణంరాజు గారితో రెబల్ అనే సినిమాకి పనిచేశారు. ఈ సినిమా సమయంలో కృష్ణంరాజుతో లారెన్స్ కు మంచి అనుబంధం ఏర్పడింది. ఈ సందర్భంగా ఈ సినిమా షూటింగ్ సమయంలో కృష్ణంరాజు గారు తనతో పాటు లొకేషన్ లో ఉన్న వారి పట్ల ఎలా బాధ్యతగా వ్యవహరించే వారో గుర్తు చేసుకుని ఆవేదన వ్యక్తం చేశారు.

కృష్ణంరాజు గారు సినిమా సెట్ లో ఉంటే అక్కడున్న వారందరిని తన సొంత బిడ్డల్లా చూసుకునేవారని అందరూ భోజనం చేశారా లేదా అని గమనిస్తూ అందరి పట్ల ఎంతో ప్రేమానురాగాలు చూపించేవారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా అందరి పట్ల ఎంతో ప్రేమనురాగాలను చూపించే కృష్ణంరాజు గారు నేడు మన మధ్య లేరనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నాను

ఆయన మరణించడంతో అతని ప్రేమను చాలా మిస్ అవుతున్నాను. ప్రస్తుతం తాను ఇండియాలో లేకపోవడం వల్ల కృష్ణంరాజు గారి చివరి చూపు చూసుకొని అదృష్టానికి నోచుకోలేకపోతున్నాను అంటూ ఈ సందర్భంగా లారెన్స్ కృష్ణంరాజు మృతి పై స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus