Raghava Lawrence: రాఘవ లారెన్స్ తమ్ముడికి కొనిచ్చిన కారు ఖరీదు అన్ని లక్షలా?

సినిమా ఇండస్ట్రీలో వేర్వేరు రంగాలలో ప్రతిభ చాటడంతో పాటు సేవా కార్యక్రమాలు చేస్తూ రాఘవ లారెన్స్ (Raghava Lawrence) తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఎంతోమంది దివ్యాంగులకు బైక్స్ ఇచ్చి ఈ మధ్య కాలంలో వార్తల్లో నిలిచిన రాఘవ లారెన్స్ తమ్ముడు ఎల్విన్ కు ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చారు. ఈ కారు ఖరీదు ఏకంగా 25 లక్షల రూపాయలు కావడం గమనార్హం. ఎంజీ హెక్టార్ కారును లారెన్స్ తమ్ముడికి గిఫ్ట్ గా ఇచ్చారు.

లారెన్స్ తమ్ముడు ఎల్విన్ ప్రస్తుతం బుల్లెట్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఒక సినిమాలో నటిస్తుండగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా రషెస్ చూసిన లారెన్స్ తమ్ముడి యాక్టింగ్ కు ఫిదా అయ్యి తమ్ముడిని మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కారును గిఫ్ట్ గా ఇచ్చారని సమాచారం అందుతోంది. అన్న నుంచి ఊహించని గిఫ్ట్ రావడంతో ఎల్విన్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయని తెలుస్తోంది.

కొరియోగ్రాఫర్ గా కెరీర్ ను మొదలుపెట్టిన లారెన్స్ తర్వాత రోజుల్లో డైరెక్టర్ కావడంతో పాటు అంచలంచెలుగా ఎదిగి హీరోగా కూడా స్థిరపడ్డారు. హర్రర్ కామెడీ జానర్ లో తెరకెక్కిన సినిమాలలో నటించి పాన్ ఇండియా స్థాయిలో రాఘవ లారెన్స్ విజయాలను సొంతం చేసుకున్నారు. లారెన్స్ యాక్టింగ్ న్యాచురల్ గా ఉండటంతో అన్ని వర్గాల ప్రేక్షకులకు లారెన్స్ కనెక్ట్ అయ్యారు.

పారితోషికం విషయంలో సైతం రాఘవ లారెన్స్ టాప్ లోనే ఉన్నారని తెలుస్తోంది. లారెన్స్ తో సినిమాలను నిర్మించడానికి చాలామంది నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. సినిమాలకు నష్టం వస్తే కూడా ఆ నష్టాలను భర్తీ చేసే మంచి మనస్సు ఉన్న హీరోగా లారెన్స్ కు పేరుంది. లారెన్స్ తర్వాత సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేయాలని అభిమానులు ఫీలవుతున్నారు. లారెన్స్ తర్వాత సినిమాలతో పాన్ ఇండియా హిట్లు అందుకుంటారేమో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus