2014 లో వచ్చిన ‘జిగర్ తండ’ సినిమా పెద్ద సక్సెస్ అయ్యింది. ఇందులో సిద్దార్థ్, బాబీ సింహా ప్రధాన పాత్రలు పోషించారు. ఇదే సినిమాని తెలుగులో దర్శకుడు హరీష్ శంకర్ ‘గద్దలకొండ గణేష్’ గా తీయగా.. ఇక్కడ కూడా బాగానే ఆడింది. అయితే ఒరిజినల్ లో బాబీ సింహా పాత్రకి ముందుగా లారెన్స్ నే అనుకున్నాడట దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు. ఈ విషయాన్ని స్వయంగా లారెన్స్ చెప్పుకొచ్చాడు.
‘జిగర్ తండ’ ఫస్ట్ పార్ట్ లో నేనే నటించాలి.
కానీ ఆ టైంలో తెలుగులో సినిమా చేయడంతో.. ‘జిగర్ తండ’ ని వద్దు అనుకున్నాను. కానీ ఆ సినిమా నేను ఊహించని విధంగా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. అలాగే ఆ సినిమాలో నేను చేయాల్సిన బాబీ సింహా పాత్రకి నేషనల్ అవార్డు లభించింది. దీంతో నేను మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నానే అని చాలా బాధపడ్డాను. ఈ సినిమాని మిస్ చేసుకున్నాను అనే బాధతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను.
మా ఇంట్లో నేను టీవీ చూస్తున్నప్పుడు ఈ సినిమా కనుక వస్తుంది అంటే దూరంగా వెళ్ళిపోతాను. అసలు ఆ పరిసరాల్లో కనిపించును. కానీ ఫైనల్ గా ఈ ‘జిగర్ తండ XX ‘ కోసం నన్ను కార్తీక్ అనుకున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. రూ.20 కోట్ల సినిమా మిస్ అయినా రూ.100 కోట్ల సినిమాలో ఛాన్స్ వచ్చినందుకు ఆనందపడుతున్నాను’ అంటూ (Raghava Lawrence) లారెన్స్ చెప్పుకొచ్చాడు.
గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు