Rahul Dev: ముకుల్‌ దేవ్‌ మృతికి కారణమిదే: నటుడు రాహుల్‌ దేవ్‌ క్లారిటీ

ప్రముఖ నటుడు ముకుల్‌ దేవ్‌ (Mukul Dev) ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. ముకుల్‌కి ఏమైంది, ఎందుకు హఠాత్తుగా కన్నుమూశాడు అంటూ గత కొన్ని రోజులుగా రకరకాల చర్చలు నడుస్తూనే ఉన్నాయి. డిప్రెషన్‌లోకి వెళ్లడం వల్ల అలా అయ్యాడని, ఇంకేదో కారణం ఉందని.. ఇలా చాలా చర్చలు ఆయన మృతి చుట్టూ తిరిగాయి. అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని సింపుల్‌ అండ్‌ సింగిల్‌ ఆన్సర్‌ ఇచ్చి క్లియర్‌ చేశారు ఆయన సోదరుడు నటుడు రాహుల్‌ దేవ్‌ (Rahul Dev) . ఇటీవల ఓ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయంలో స్పష్టత ఇచ్చాడు.

Rahul Dev

చాలామంది అనుకుంటున్నట్లు ముకుల్‌ దేవ్‌ (Mukul Dev) డిప్రెషన్‌తో చనిపోలేదని తేల్చి చెప్పాడు రాహుల్‌ దేవ్‌ (Rahul Dev) . గత కొన్నేళ్లుగా సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడమే ముకుల్‌ దేవ్‌ (Mukul Dev) మరణానికి దారి తీసిందని చెప్పాడు ఆయన సోదరుడు. ముకుల్‌ చనిపోవడానికి ముందు వారం రోజులకు పైగా ఐసీయూలో ఉన్నాడు. లైఫ్‌లో సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడమే అనారోగ్యానికి కారణమని ఆ సమయంలో వైద్యులు తెలిపారు. మరోవైపు ఆస్పత్రిలో చేరిన తర్వాత పూర్తిగా తినడం మానేశాడు అని రాహుల్‌ (Rahul Dev) చెప్పుకొచ్చాడు.

అయితే, ఆహారపు అలవాట్ల కారణంగా అనారోగ్యం పాలయ్యాక.. కొంతకాలం ఒంటరితనంతో బాఢపడ్డాడు. ఆ సమయంలో సినిమా అవకాశాలు వచ్చినా వదులుకున్నాడు అని రాహుల్‌ దేవ్‌ (Rahul Dev) చెప్పుకొచ్చాడు. మరోవైపు 2019లో తన తండ్రి మరణం కూడా ముకుల్‌ (Mukul Dev) పై తీవ్ర ప్రభావం చూపించిందని రాహుల్‌ (Rahul Dev) తెలిపాడు. ఆ తర్వాత తల్లి మరణం, భార్యతో విడాకులు లాంటివి అతడిని మరింత కుంగదీసినట్లు వివరించాడు. ఆ సమయంలోనే ఎక్కువగా ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడ్డాడని తెలిపాడు. ఆ నేపథ్యంలోనే ఆహారపు అలవాట్లు కూడా మారాయని చెప్పాడు.

ఇవన్నీ తెలియకుండా ముకుల్‌ (Mukul Dev) గురించి ఏవేవో మాట్లాడుతున్నారని అన్న రాహుల్‌ (Rahul Dev).. ఈ రోజు ఆరోపణలు చేస్తున్న ఎవరైనా ముకుల్‌ బతికి ఉన్నప్పుడు ఆస్పత్రికి వచ్చి కనీసం పరామర్శించారా అని రాహుల్‌ దేవ్‌ (Rahul Dev) ప్రశ్నించాడు. ఇక ముకుల్‌ సంగతి చూస్తే.. సీరియల్‌ నటుడిగా కెరీర్‌ ప్రారంభించి..‘సన్‌ ఆఫ్‌ సర్దార్‌’, ‘జైహో’, ‘యమ్లా పగ్లా దీవానా’ లాంటి బాలీవుడ్‌ సినిమాలు చేశాడు. తెలుగులో ‘కృష్ణ’ (Krishna), ‘అదుర్స్‌’ (Adhurs), ‘సిద్ధం’ (Siddham), ‘నిప్పు’ (Nippu), ‘భాయ్‌’ (Bhai) తదితర సినిమాల్లో నటించాడు.

‘కన్నప్ప’ పై ఆశలు పెరుగుతున్నాయా..!?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus