Rahul Ramakrishna: నెటిజెన్ వింత ప్రశ్నకి రాహుల్ రామకృష్ణ షాకింగ్ రిప్లై..!

విజయ్ దేవరకొండ- సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కిన ‘అర్జున్‌ రెడ్డి’ చిత్రం ద్వారా కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చాడు రాహుల్‌ రామకృష్ణ. ఆ తర్వాత ఇతను చేసిన ‘గీత గోవిందం’ ‘బ్రోచేవారెవరురా’ ‘జాతిరత్నాలు’, ‘కల్కి’, ‘నెట్’ వంటి చిత్రాలతో ఇతను బాగా ఫేమస్ అయ్యాడు. ఈ మధ్యనే ‘ఆర్ ఆర్ ఆర్’ ‘అంటే సుందరానికి’ ‘హ్యాపీ బర్త్ డే’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందు వచ్చాడు. ప్రస్తుతం ఇతను చాలా సినిమాల్లో, వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు.

సోషల్ మీడియాలో కూడా ఇతను చాలా యాక్టివ్ గా ఉంటాడు అన్న సంగతి తెలిసిందే. అప్పుడప్పుడు ఇతను చేసే ట్వీట్లు వైరల్ అవుతుంటాయి. తాజాగా రాహుల్ రామకృష్ణ అభిమానులతో ముచ్చటించాడు. ‘సినిమా, సాహిత్యం, సంగీతం..’ వీటి గురించి ఏదైనా అడగండి..అంటూ చిట్ చాట్ సెషన్ స్టార్ట్ చేశాడు. కానీ ఛాన్స్ దొరికితే నెటిజన్లు ఎలా రియాక్ట్ అవుతారో తెలిసిన సంగతేగా..! ఇప్పుడు కూడా అదే జరిగింది. ఇతను చిట్ చాట్ సెషన్ ను గమనిస్తే..’మీకు నచ్చిన వెబ్‌ సిరీస్‌ ఏంటి? అన్న?’ అని నెటిజెన్ అడిగిన ప్రశ్నకు…

‘బెటర్‌ కాల్‌ సాల్‌’ అని బదులిచ్చాడు. ‘ఈ మధ్య నీ లెక్క తెలంగాణ మాండలికంలో చాలా తక్కువమంది మాట్లాడుతారు. నువ్వు యాస చాలా స్పష్టంగా మాట్లాడుతావు. దానికి ఏమన్నా హోంవర్క్‌ చేస్తావా భయ్యా? లేక సహజంగానే అంతేనా?’ అని మరో నెటిజెన్ ప్రశ్నించగా..

‘మాతృభాషకు హోం వర్క్‌ అక్కర్లేదని నా ఫీలింగ్‌’ అంటూ జవాబిచ్చాడు. ఇంకో నెటిజెన్ అయితే.. ‘ఎప్పుడైనా తాగేసి ట్వీట్ చేశావా?’ అని ప్రశ్నించాడు.దీనికి రాహుల్ రామకృష్ణ ‘చాలా సార్లు’ అంటూ బదులిచ్చి ఆ నెటిజెన్ తో పాటు అందరికీ షాకిచ్చాడు.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus