ప్రైవేట్ సాంగ్స్ ఆల్బమ్స్ తో కెరీర్ మొదలుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సింగర్ రాహుల్ సిప్లిగంజ్. రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ లో కీరవాణి మ్యూజిక్ అందించిన నాటు నాటు పాట రాహుల్ పాడటం ఆ సాంగ్ కు గాను ఆస్కార్ అవార్డు రావడం జరిగింది. హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీ నుంచి మొదలైన తన ప్రస్థానం ఆస్కార్ అవార్డు గెలుచుకోవడం వరకు వెళ్లడం మన తెలుగు వాళ్లందరు గర్వించదగ్గ విషయం. అయితే ఈ సింగర్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నాడు అనే సంగతి తెలిసిందే. తన స్నేహితురాలు హరిణ్య రెడ్డిని ప్రేమ వివాహం చేసుకోబోతున్నాడు రాహుల్ సిప్లిగంజ్.
రీసెంట్ గానే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని రాహుల్ తన కాబోయే భార్య హరిణ్య రెడ్డి తో కలిసి వెళ్లి స్వయంగా వారి పెళ్లిపత్రిక ని ఇచ్చి పెళ్ళికి ఆహ్వానించారు. అయితే రాహుల్ , హరిణ్య ను ఎప్పుడు సర్ప్రైజ్ చేయటానికి ఇష్టపడుతుంటాడట. వీరి నిశితార్ధ వేడుకలో కూడా హరిణ్యకు చాలా విలువైన హ్యాండ్ బాగ్ గిఫ్ట్ గా ఇచ్చి సర్ప్రైజ్ చేసాడు రాహుల్. వీరి వివాహం ఈ నెల 29న (నవంబర్ 29న) ఘనంగా జరగనుంది.

వివాహానికి సంబందించిన సంగీత్ వేడుక జరుగగా, హరిణ్య కు మరో సర్ప్రైజ్ ఇచ్చాడంట రాహుల్. హారిణ్యకు మోస్ట్ ఫేవరేట్ క్రికెటర్ అయిన చాహల్ ను వీరి సంగీత్ కి రప్పించి , తన ప్రేయసిని ఆశ్చర్యానికి గురి చేసాడట. చాహల్ అంటే అమితమైన అభిమానం గల హరిణ్య చాహల్ తో పిక్స్ దిగి సోషల్ మీడియా అకౌంట్ ద్వారా థాంక్యూ రాహుల్ అంటూ , చాహల్ ని టాగ్ చేస్తూ మీ రాక ఎప్పటికి గుర్తుంటుంది అని రాస్తూ పోస్ట్ చేసింది. వీరి వివాహానికి పలువురు ప్రముఖులను ఆహ్వానించారని టాక్.
