కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నటువంటి బ్రహ్మముడి సీరియల్ రోజురోజుకు ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంటుంది. ఇక నేటి ఎపిసోడ్లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగిందనే విషయాన్నికి వస్తే.. రాజ్ మట్టి తొక్కుతున్నటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది అపర్ణకు చూపించిన రుద్రాణి పెద్ద గొడవ క్రియేట్ చేయడానికి సిద్ధమవుతుంది అంతలోపు కావ్య వచ్చి పైకి వెళ్తుండగా ఆగు అంటూ అపర్ణ అడ్డుపడుతుంది. నా కొడుకుని చూసి నువ్వు ఏమనుకుంటున్నావు అసలు నా కొడుకు స్థాయి ఏంటి నీ స్థాయి ఏంటి నువ్వు నీ స్థాయిలో ఉండు నా కొడుకుని కూడా నీ స్థాయికి దిగజార్చవద్దు అంటూ నానా మాటలు మాట్లాడుతుంది.
ఇప్పుడేం జరిగిందని కావ్య అనడంతో నా కొడుకుతో మట్టి ఎందుకు తొక్కించావనీ అపర్ణ ప్రశ్నిస్తుంది. మీరు దృష్టి అక్కడ కూడా పెట్టారా ఇలాంటి పని ఎవరు చేసి ఉంటారు అని రుద్రాణి తన కొడుకు రాహుల్ ని అంటుంది. మధ్యలో నేనేం చేశాను అంటూ రుద్రాణి కూడా కావ్యతో గొడవ పడుతుంది. ప్రతిరోజు నేను మా ఇంటికి వెళ్లి రావడం మీరు ఏదో ఒక పంచాయతీ పెట్టినను నిలబెట్టడం అంటూ రుద్రాణి మీద కావ్య అరుస్తుండగా ఆపర్ణ అడ్డుపడి అవన్నీ నాకు అనవసరం నువ్వు నాకొడుకుతో మట్టి ఎందుకు తొక్కించావు అంటూ అపర్ణ మాట్లాడటంతో కావ్య కూడా తనమీద అరుస్తుంది.
అసలు మీ ప్రాబ్లమ్ ఏంటి అత్తయ్య మీరు నన్ను కోడలుగా అంగీకరించరు. నేను డిజైన్స్ వేసి వచ్చిన డబ్బును మా అమ్మవారికి ఇస్తే అది కూడా ఒప్పుకోరు. పోనీ ఇలా ఏదైనా పనులు చేస్తే అంగీకరించారు నాకు నా భర్త మద్దతుగా నిలబడితే ఒప్పుకోరు అసలు మీరు నన్ను కోడలుగా ఒప్పుకోకపోతే మీ కొడుకు కూడా భార్యగా ఒప్పుకోకూడదా మీ బాధంతా ఏంటి ఎక్కడ మేమిద్దరం కలిసి పోతామేనని కదా..ఏ తల్లి అయిన కొడుకు జీవితాన్ని పాడు చేస్తుందా అయినా మీరు నిజంగానే ఆయనకు తల్లేనా అంటూ కావ్య మాట్లాడటంతో వెనక వచ్చినటువంటి రాజ్ ఏం మాట్లాడుతున్నావ్ అంటూ తనపై చేయి ఎత్తుతారు.
మా అమ్మ గురించి ఏం తెలుసు అని నువ్వు అలా మాట్లాడుతున్నావు. నువ్వు నీ ప్రవర్తన కారణంగా ఈ ఇంటి పరువును బజారుకు ఈడ్చావు ఇష్టం లేకపోయినా ఇంట్లో వాళ్ళు చెప్పారు కాబట్టి నీ మెడలో తాళి కట్టాను నిన్ను నా గదిలోకి రానిచ్చాను మా అమ్మకు కోడలిగా ఇష్టం లేనటువంటి నువ్వు నాకు కూడా భార్యగా ఇష్టం లేదు అంటూ తనని ఇంటి నుంచి బయటకు గెంటేస్తారు ఇంట్లో అందరూ చెబుతున్న వినిపించుకోకుండా తనని బయటకు గెంటి తలుపులు వేస్తారు దీంతో రాహుల్ రుద్రాన్ని స్వప్న సంతోషపడతారు. మరోవైపు వర్షం పడేలాగా ఉంది అని దేవుడి విగ్రహాలన్నింటిని లోపల పెట్టాలని కృష్ణమూర్తి చెబుతాడు.
కనకం దేవుడి విగ్రహాలను లోపల పెట్టబోతున్న సమయంలో దేవుని విగ్రహం పగిలిపోతుంది. దీంతో కనకం నా మనసు ఏదో కీడు సంకిస్తోంది ఇలా దేవుడి విగ్రహం పడిపోవడమేంటి అని కనకం మాట్లాడటంతో రేపు ఆ విగ్రహాలన్నింటిని కూడా నిమర్జనం చేసేవే కదా అంటూ తనని అలాంటి ఆలోచనలు చేయదని చెబుతాడు అయినా నా మనస్సు ఏదో బాధగా ఉందని చెబుతుంది. రాజ్ కావ్యాను బయటకు గెంటి తన గదిలోకి వెళ్ళగా కళ్యాణ్ తన గదికి వెళ్తారు. వదిన ఇప్పుడేం తప్పు చేసిందని అన్నయ్య తనని అలా బయటకు పంపించేశావు తను చాలా మంచిది. నువ్వు అపార్థం చేసుకుని ఆవేశంలో బయటకు పంపించావు వెళ్లి తనని లోపలికి తీసుకురా అని అనడంతో రాజ్ తనని తాను సమర్ధించుకుంటూ ఉంటాడు.
అమ్మని అన్ని మాటలు అంది. అయినా తను అన్నది మీ అమ్మను కాదు కదా ఆ బాధ నీకెందుకు ఉంటుంది అని రాజ్ మాట్లాడటంతో నన్ను అమ్మ పెద్దమ్మ ఇద్దరు సమానంగా పెంచారు. వదిన వచ్చిన తర్వాత కూడా తను కూడా నన్ను అమ్మలాగే చూసుకుందని అంటాడు. మరి నీకు అంత బాధగా ఉంటే నువ్వే వెళ్లి తనని వాళ్ళ పుట్టింట్లో వదిలి రా అని చెప్పడంతో లక్ష్మణుడు సీతాదేవిని వదిలి వచ్చినట్టుగా నేను తనని వాళ్ల పుట్టింట్లో వదిలి రాలేను తనని లోపలికి పిలుచు అన్నయ్య అంటూ రాజ్ కి చెబుతాడు. కావ్య మాత్రం అలాగే శిక్ష అనుభవిస్తూ వర్షం పడుతున్న బయట నిలబడి ఉంటుంది.