రాజ్‌ కందుకూరి రిలీజ్ చేసిన `ప్రణయ గోదారి` గ్లింప్స్‌

రొటీన్‌ కథలకు భిన్నంగా.. కొత్తగా రూపొందే చిత్రాలకే నేటి ప్రేక్షకులు ఆదరణ చూపిస్తున్నారు. అలాంటి కథలనే నేటి తరం దర్శక, నిర్మాతలు కూడా సినిమాలుగా తీసుకరావడానికి మొగ్గుచూపుతున్నారు. ఆ కోవలోనే న్యూ కంటెంట్‌తో రిఫ్రెషింగ్‌ ఫీల్‌తో రూపొందుతున్న చిత్రం ‘ప్రణయగోదారి’. పి.ఎల్.విఘ్నేష్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని పారమళ్ళ లింగయ్య నిర్మిస్తున్నారు. డిఫెరెంట్ కంటెంట్ తో ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్‌. ఎటువంటి పాత్రనైనా చాలా అవలీలగా పోషించి, ప్రేక్షకులను మెప్పించే డైలాగ్ కింగ్ సాయికుమార్ ఈ చిత్రంలో తన ప్రత్యేక నటన శైలితో కనిపించబోతున్నారు. ఈ సినిమాలో ప్రముఖ హాస్య నటుడు అలీ కుటుంబానికి చెందిన నటుడు సదన్ హీరోగా నటిస్తున్నాడు, ప్రియాంక ప్రసాద్ హీరోయిన్ గా నటిస్తుంది. సునిల్ రావినూతల ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. కాగా ఇటీవల ఈ చిత్రం డైలాగ్‌ కింగ్‌ సాయికుమార్‌ పెదకాపు లుక్‌ను శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్రం పవర్‌ఫుల్‌ గ్లింప్స్‌ను ప్రముఖ నిర్మాత రాజ్‌ కందుకూరి చేతుల మీదుగా విడుదల చేశారు.

ఈ సందర్భంగా రాజ్‌ కందుకూరి మాట్లాడుతూ… `ప్రణయగోదారి ` గ్లింప్స్‌ చాలా బాగుంది. కంటెంట్‌ చూస్తుంటే తప్పనిసరిగా అందరికి నచ్చుతుందనే నమ్మకం కలుగుతుంది. ఈ చిత్రంలో సాయికుమార్ డైలగ్స్ అన్నీ చాలా ఇన్ ట్రెస్టింగా.. పవర్‌ఫుల్‌గా వున్నాయి. చిత్రం ప్రేక్షకుల ఆదరణతో చాలా మంచి సక్సెస్ అవ్వాలి. ఈ సినిమా యూనిట్‌కు నా అభినందనలు’ అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ… ‘రాజ్‌కందుకూరి గారి చేతుల మీదుగా గ్లింప్స్‌ విడుదల చేయడం ఆనందంగా వుంది.
ఫీల్‌గుడ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొంద‌తున్న ఈ చిత్రంలో అన్ని వ‌ర్గాల వారిని అల‌రించే అంశాలున్నాయి. ఈ సినిమా ప్రేక్షకులకు డిఫరెంట్ అనుభూతిని కలిగించే కథతో వ‌స్తోంది. టైటిల్‌కి తగ్గట్టుగా నాచురల్ లొకేషన్స్ లో చిత్రీక‌ర‌ణ చేస్తున్నాం. గోదారి అందాలు, అక్కడి ప్రజల జీవన విధానాలు చిత్రంలో క‌నిపిస్తాయి. కొత్త‌ద‌నం ఆశించే ప్రేక్ష‌కుల‌కు మా చిత్రం త‌ప్ప‌కుండా న‌చ్చ‌తుంద‌నే న‌మ్మ‌కం వుంది. చిత్రాన్ని త్వరలోనే విడుద‌ల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు.

ప్రణయగోదారి సినిమా గ్లింప్ల్‌ చూస్తుంటే.. సన్నివేశాలు.. సంభాషణలు పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నాయి. .కింగ్ సాయికుమార్ ఈ సినిమాలో పెదకాపు పాత్రలో ఊరి పెద్దలాగా కనిపిస్తున్నారు. ఆయన చెప్పిన డైలాగులు… ‘తప్పు ఎవరు చేసినా తీర్పు ఒక్కటే’…’ఆకాశానికి హద్దుండదు ఈ పెదకాపు మాటకు తిరుగుండదు’……. ‘నే పుట్టిన ఈ గోదారి తల్లి మీద ఒట్టు’ అని సాయికుమార్ తన పవరఫుల్ డైలాగులతో మెస్మరైజ్ చేశాడు. ‘ప్రాణం పోయినా సహిస్తాను….భరిస్తాను …నా సహనాన్ని.. మంచితనాన్ని పరీక్షించొద్దు’ అనే డైలాగుతో చాలా రౌద్రంగా కనిపిస్తున్నారు. గ్లింప్స్‌లో ఆయన పాత్రలోని గంభీరత్వం కూడా కనిపిస్తుంది. గ్లింప్స్‌ను చూస్తే సినిమా మొత్తానికి సాయికుమార్ పాత్ర చాలా ముఖ్యమైనదిగా తెలుస్తుంది. గోదారి నది ఒడ్డున హీరో హీరోయిన్ల ఆటలు, వారి ప్రేమాయణం సన్నివేశాలు చూస్తుంటే ఈ చిత్రంలో యువతను అలరించే అంశాలు కూడా వున్నట్లు తెలుస్తుంది.

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus