Raj Tarun: రాజ్ తరుణ్ కంటే ముందు అతనికి చెప్పారట

గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనుభవించు రాజా సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫలితాన్ని అందుకుంది. తప్పకుండా ఈ సినిమాతో మళ్ళీ ట్రాక్ లోకి రావాలి అనుకున్న రాజ్ తరుణ్ మళ్ళీ ఎప్పుడు ఇలానే డిజాస్టర్ ఎదుర్కొన్నాడు. అయితే ఈ సినిమా దర్శకుడు శ్రీను గవి రెడ్డి రాజ్ తరుణ్ కంటే ముందే కొంత మంది హీరోలను కూడా సంప్రదించారట. అందులో కొంత మంది స్టార్ హీరోలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే దర్శకుడు శ్రీను మొదట ఈ కథను రాసుకో గానే ఎక్కువగా మాస్ మహారాజా రవితేజకు కూడా చెప్పాలని అనుకున్నాడు. రవితేజ కూడా ఈ కథను విన్న తర్వాత కొన్ని రోజులు ఆలోచించే రిజెక్ట్ చేశాడట. సినిమాలో కంటెంట్ అనుకున్నంతగా డిఫరెంట్ గా లేదు అని రవితేజ తన ఆలోచనతో ప్రాజెక్టు నుంచి దూరంగా జరిగినట్లు సమాచారం. అంతేకాకుండా రవితేజ క్రాక్ హిట్ అనంతరం ఖిలాడి వంటివి మాస్ యాక్షన్ సినిమాలు చేస్తూ మరికొన్ని డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలో కూడా చేయాలని అనుకుంటున్నాడు.

ఈ తరుణంలో రెగ్యులర్ కమర్షియల్ కామెడీ సినిమాలు చేయకూడదని డిసైడ్ అయ్యాడట. ఇక అనుభవించు రాజా రవితేజకు కూడా అంతగా వర్కౌట్ అయ్యి ఉండేది కాదేమో. రాజ్ తరుణ్ మరోసారి తన రాంగ్ స్టోరీ సెలక్షన్స్ తో దెబ్బ తిన్నాడు.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video
x
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
ప్రిన్స్ టు రవి.. ‘బిగ్ బాస్’ లో జరిగిన 10 షాకింగ్ ఎలిమినేషన్స్..!
చిరు, కమల్ మాత్రమే కాదు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ప్లాపైన స్టార్స్ లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus