Bigg Boss Telugu 6: గ్లాజ్ కోసం గొడవ పడ్డ హౌస్ మేట్స్..! బాటిల్ ఆఫ్ సర్వైవల్ టాస్క్ లో జరిగింది ఇదే..!

బిగ్ బాస్ హౌస్ లో ఏడోవారం ఊహకందని ట్విస్ట్ లు జరిగాయి. బిగ్ బాస్ హౌస్ మేట్స్ పై అసంతృప్తిని ప్రకటిస్తునే ఉన్నారు. మునుపెన్నడూ లేని విధంగా బిగ్ బాస్ హౌస్ మేట్స్ ఆడియన్స్ ని, బిగ్ బాస్ ని నిరుత్సాహ పరుస్తున్నారని చెప్పాడు. అంతేకాదు, టాలీవుడ్ సెలబ్రిటీ లీగ్ టాస్క్ ని రద్దు చేశాడు. ఈవారం హౌస్ లో కెప్టెన్ కూడా ఎవరూ లేరని తేల్చిచెప్పాడు. దీంతో హౌస్ మేట్స్ అందరూ బిగ్ బాస్ ని వేడుకున్నారు. అయినా కూడా బిగ్ బాస్ హౌస్ మేట్స్ తో మాట్లాడట్లేదు. ఏది చేయాలన్నా పోస్ట్ ద్వారానే పంపిస్తున్నాడు.

ఇక ఈవారం నామినేషన్స్ నుంచీ సేఫ్ అయ్యేందుకు బాటిల్ ఆఫ్ సర్వైవల్ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. దీనికోసం హౌస్ మేట్స్ బాగా పోటీపడ్డారు. అయితే, ఈటాస్క్ లో గ్లౌజ్ కోసం బాగా గొడవ అయినట్లుగా సమాచారం తెలుస్తోంది. నిజానికి హౌస్ మేట్స్ పై బిగ్ బాస్ చాలా కోపంగా ఉన్నాడు. అస్సలు మాట్లాడదలుచుకోలేదు. మార్నింగ్ దీనికోసం బిగ్ బాస్ హౌస్ మేట్స్ తో ఒక ప్రతిజ్ఞ కూడా చేయించాడు. హౌస్ మేట్స్ అందరూ తమ ఆటతీరుని ఎలా మార్చుకోవాలి అనుకుంటున్నారో ఈ ప్లెడ్జ్ లో చెప్పారు.

అంతేకాదు, హౌస్ మేట్స్ తో ఏది చెప్పాలన్నా బిగ్ బాస్ ఎనౌన్స్ మెంట్స్ మానేసి లెటర్స్ ద్వారానే పంపుతున్నాడు. కనీసం ఇది కూడా నోటీస్ చేయలేదు హౌస్ మేట్స్. తర్వాత బిగ్ బాస్ బాటిల్ ఆఫ్ సర్వైవల్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో హౌస్ మేట్స్ పూలు, బొమ్మలు బెల్ట్ ద్వారా కలక్ట్ చేసి వారికి కేటాయించిన ప్లేస్ లో దాన్ని కాపాడుకోవాల్సి ఉంటుంది. ఈ టాస్క్ లో భాగంగా అందరూ హౌస్ మేట్స్ పోటీపడ్డారు. ఎలాగైనా బిగ్ బాస్ మెప్పు పొందాలని పోటా పోటీగా ఆడారు.

ఈ టాస్ఇంక్దు లో గెలిచిన వారికి ఈవారం ఇమ్యూనిటీ లబిస్తుంది. అయితే, అది వచ్చేవారం అయినా వాడుకోవచ్చా ? లేదా ఈవారం ఎలిమినేషన్ నుంచీ సురక్షితులు అవ్వచ్చా అనేది బిగ్ బాస్ ఎనౌన్స్ చేస్తాడు. ఇందులో భాగంగా ఈ టాస్క్ లో రాజ్ గెలిచినట్లుగా సమాచారం. అయితే, ఈవారం రాజ్ సేఫ్ అయినట్లే లెక్క. ఇది బిగ్ బాస్ ఆదేశం ప్రకారం డిసైడ్ అవుతుంది. రాజ్ గెలిచిన తర్వాత మిగతా వాళ్లకి వీకండ్ నాగార్జున చేతిలో క్లాస్ పడే ప్రోగ్రామ్ ఉండబోతోంది.

అయితే, శనివారం ఎపిసోడ్ ఎలా ఉన్నా కూడా, వచ్చే ఆదివారం దీపావళి ఎపిసోడ్ కి స్టేజ్ ముస్తాబవుతోంది. దీనికోసం చాలామంది సెలబ్రిటీలని తీస్కుని రాబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఈసారి దీపావళికి గ్రాండ్ గా ప్లాన్ చేశారు. అయితే, ఈసారి ఎవర్ని ఎలిమినేట్ చేస్తారు అనేది చాలా ఆసక్తికరం. పండగ కాబట్టి డబుల్ ఎలిమినేషన్ చేస్తారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అదీ మేటర్.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus