కార్తికేయ గుమ్మకొండ హీరోగా శ్రీ సరిపల్లిని దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘రాజా విక్రమార్క’.తాన్యా రవిచంద్రన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఆదిరెడ్డి .టి సమర్పణలో ’88’ రామారెడ్డి నిర్మించారు. టీజర్, ట్రైలర్లు ప్రేక్షకుల్ని ఆకర్షించాయి. దాంతో నవంబర్ 12న విడుదల కాబోతున్న ఈ చిత్రానికి మంచి బిజినెసే జరిగింది.
‘రాజా విక్రమార్క’ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్ ను ఒకసారి గమనిస్తే :
నైజాం
1.55 cr
సీడెడ్
0.70 cr
ఉత్తరాంధ్ర
0.40 cr
ఈస్ట్
0.30 cr
వెస్ట్
0.25 cr
గుంటూరు
0.28 cr
కృష్ణా
0.32 cr
నెల్లూరు
0.15 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
3.95 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
0.15 Cr
ఓవర్సీస్
0.20 Cr
వరల్డ్ వైడ్ (టోటల్)
4.30 cr
‘రాజా విక్రమార్క’ చిత్రానికి రూ.4.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. సో బ్రేక్ ఈవెన్ కు రూ.4.5 కోట్ల షేర్ ను రాబట్టాలి. విడుదల చేసిన ప్రోమోలు వంటివి ప్రామిసింగ్ గానే ఉన్నాయి. పోటీగా ‘పుష్పక విమానం’ ‘కురుప్’ వంటి చిత్రాలు ఉన్నాయి. టార్గెట్ ను బట్టి ఆ పోటీ పెద్ద కష్టమైనది ఏమీ కాదు. మరి ‘రాజా విక్రమార్క’ బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో చూడాలి.