కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్ లో ‘ఆర్.ఆర్.ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా ఏర్పాటు చేసారు. ఈ క్రమంలో దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర కామెంట్లు చేసారు. ఆయన మాట్లాడుతూ.. “రామ్‌చరణ్, ఎన్టీఆర్ కలిసిన ఈ వేదిక మైత్రీ సంగమం వంటిది. అంతేకాదు మెగా అభిమానులు బంగాళాఖాతం వంటివారు, నందమూరి అభిమానులను అరేబియా మహాసముద్రం వంటివారు. నాకు నా ఫ్యామిలీ మెంబర్స్ కంటే అసిస్టెంట్ డైరెక్టర్‌లే ఎక్కువ. పేరుపేరునా వారందరికీ నా కృతజ్ఞతలు తెలిపుకుంటున్నాను.
త్వరలో మరో ఆర్.ఆర్.ఆర్ సినిమా ఉంటుంది. హీరోల కంటే ముందే అసిస్టెంట్ డైరెక్టర్లు నటించి చూపిస్తారు. వాటిని కూడా షూట్ చేశాము. సినిమా రిలీజ్ అయ్యాక వాటిని కూడా అభిమానులకు చూపిస్తాము.ఇక టిక్కెట్ రేట్ల హైక్ విషయంలో మా మూవీ టీంకి సహకరిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి, ఏపీ ప్రభుత్వానికి నా స్పెషల్ థాంక్స్. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం టిక్కెట్ రేట్ల పై గతంలో జారీ చేసిన కొత్త జీవో మాకు సమస్యగా మారుతుంది అని అంతా భయపడ్డాం.
ఆ టైములో మేము ఏమాత్రం ముందడుగు వేయలేకపోయాం.! అలాంటి టైములో మెగాస్టార్ చిరంజీవి గారు ముందుకు వచ్చి మమ్మల్ని ముందుకు నడిపించారు.ఆయనకి ఏపి ముఖ్యమంత్రి జగన్ గారితో ఉన్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించి మా కోసం ఆయన వంతు శ్రమించారు. కొత్త జీవో రావడానికి ఆయనే కారణం.తెలంగాణలో టికెట్ రేట్ల హైక్ కి కొత్త జీవో రావడానికి కూడా ఆయనే కారణం.ఆయన తెరవెనుక ఉండి మమ్మల్ని ముందుకు నడిపించారు. ఆయన ట్రూ మెగాస్టార్. ఇండస్ట్రీ పెద్ద అనిపించుకోవడం ఆయనకి ఇష్టం ఉండదు..
ఇండస్ట్రీ బిడ్డగానే ఆయన ఉంటాను అంటారు. కానీ నా దృష్టిలో ఆయనే ఇండస్ట్రీ పెద్ద. మా కోసం ఆయన చాలా తగ్గారు. అలాగే ఎన్నో మాటలు పడ్డారు. చిరంజీవిగారిని చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారు.” అంటూ చెప్పుకొచ్చారు.