ఎన్టీఆర్- రాంచరణ్ కాంబినేషన్లో గతేడాది రిలీజ్ అయ్యి రికార్డులు బద్దలుగొట్టిన చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’. ‘బాహుబలి'(సిరీస్) తర్వాత రాజమౌళి తీర్చిదిద్దిన ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని డీవీవీ దానయ్య.. భారీ బడ్జెట్ తో నిర్మించారు. మార్చి 25న రిలీజ్ అయిన ఈ మూవీ రూ.1200 కోట్ల వరకు కొల్లగొట్టింది. ‘నాటు నాటు’ సాంగుకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా లభించింది. అయితే ఎంతో వరల్డ్ వైడ్ ప్రేక్షకులు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకునే ఆస్కార్ అవార్డు నామినేషన్స్ కు ఇండియా తరఫున ఈ మూవీకి ఎంట్రీ దక్కకపోవడంతో ప్రేక్షకులందరూ అప్సెట్ అయ్యారు.
తాజాగా ఈ విషయంపై రాజమౌళి స్పందించి తన ఫీలింగ్స్ ను వ్యక్తం చేశారు. వరల్డ్ వైడ్ గా సక్సెస్ సాధించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ఇండియా తరఫున ఆస్కార్ కు ఎంట్రీ లభించకపోవడం పై రాజమౌళి స్పందించారు.రాజమౌళి ఈ విషయంపై స్పందిస్తూ.. “దేశం తరఫున మా సినిమాకి అధికారికంగా ఎంట్రీ లభించకపోవడం పట్ల నేను నిరాశ చెందిన మాట నిజమే.! అయితే ‘ఎంట్రీ ఎందుకు లభించలేదు’ అని ఏడుస్తూ అయితే కూర్చోలేదు.
ఆ విషయం గురించి పదే పదే ఆలోచించి బాధపడే వ్యక్తులం అయితే మేము కాదు. ఏదేమైనా మేము ముందుకు సాగిపోవాలి. మన దేశం నుంచి ‘లాస్ట్ ఫిల్మ్ షో’ (Last Film Show) ఆస్కార్ షార్టిస్ట్లో స్థానం సొంతం చేసుకున్నందుకు నేను ఆనందించాను. ‘ఆర్ఆర్ఆర్’ అధికారికంగా ఆస్కార్ కు నామినేట్ అయ్యుంటే బాగుండేదని విదేశీయులు సైతం అనుకుంటున్నారు.
కానీ, ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎలా ఉంటుంది? దాని నియమ నిబంధనలు ఏమిటి? అనేవి నాకు తెలియదు. కాబట్టి, దాని గురించి నేను కామెంట్ చేయాలనుకోవడం లేదు” అంటూ రాజమౌళి చెప్పుకొచ్చారు.
వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!
‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?