Rajamoul: ‘ఆర్ఆర్ఆర్’ సీక్వెల్ ప్లాన్ లో రాజమౌళి!

రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. ఈ సినిమా కోసం దేశం మొత్తం తిరిగి ప్రమోషన్స్ చేశారు రాజమౌళి. రీసెంట్ గా జపాన్ లో ఈ సినిమాను రిలీజ్ చేశారు. దానికోసం చరణ్, ఎన్టీఆర్ ఓ రేంజ్ లో ప్రమోషన్స్ చేశారు. అక్కడికి వెళ్లి మరీ తమ అభిమానులను కలుసుకున్నారు. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’కి ఆస్కార్ వచ్చే వరకు వెనక్కి తగ్గేలా లేరు. ప్రపంచం మొత్తం సినిమా ప్రమోషన్స్ కోసం తిరుగుతున్నారు.

ప్రీమియర్లు వేసిన ప్రతి చోటా హాజరవుతున్న రాజమౌళి.. షో అయిన వెంటనే అక్కడ మీడియా, ఆడియన్స్ తో ఇంటరాక్ట్ అవుతూ చాలా విషయాలు చెబుతున్నారు. చికాగోలో మాట్లాడుతూ.. ‘ఆర్ఆర్ఆర్’కి సీక్వెల్ ఉంటుందని ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయని చెప్పి షాకిచ్చారు. అంతేకాదు.. ‘బాహుబలి3’ కూడా ప్రతిపాదనలో ఉందట. ఇవి అమెరికా ప్రేక్షకులకు థ్రిల్లింగ్ గా అనిపిస్తాయేమో కానీ వాస్తవిక కోణంలో చూస్తే మాత్రం ఇది అసలు జరిగే పనిలా కనిపించడం లేదు.

రాజమౌళి తన నెక్స్ట్ సినిమా మహేష్ బాబుతో చేయబోతున్నారు. అదొక గ్లోబల్ ఫిల్మ్ అని ఆయనే చెప్పారు. ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పూర్తి కాలేదు. ప్రస్తుతం మహేష్.. త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా పూర్తవుతుంది. అప్పటికి రాజమౌళి స్క్రిప్ట్ పూర్తవుతుందో లేదో చెప్పలేం. ఒకవేళ వచ్చే ఏడాదిలో సినిమా మొదలైనా.. అక్కడినుంచి మరో మూడేళ్లవరకు సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదు.

ఆ తరువాత ‘ఆర్ఆర్ఆర్’ సీక్వెల్ ఉంటుందనుకున్నా.. ఎన్టీఆర్, రామ్ చరణ్ లను ఒప్పించి మళ్లీ వారి డేట్స్ తీసుకొని మొత్తం సెట్ చేయడానికి ఇంకెంత సమయం పడుతుందో ఊహించుకోవచ్చు. ఇదంతా జరిగి ‘ఆర్ఆర్ఆర్’ సీక్వెల్ రావడానికి 2030 అయిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అప్పటికి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై ప్రేక్షకుల్లో పెద్దగా ఆసక్తి ఉండకపోవచ్చు. ఇక ‘బాహుబలి3’ అసలు ఎప్పుడు మొదలవుతుందో కూడా చెప్పలేం. ఇదంతా చూస్తుంటే రాజమౌళి తన సినిమాలపై హైప్ ఉండాలని ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారేమో అనిపిస్తుంది.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus