“థగ్స్ ఆఫ్ హిందుస్థాన్” ట్రైలర్ పై రాజమౌళి కామెంట్

“ద్రోహం చేయడం నా స్వభావం.. నమ్మడం నా స్వభావం”.. ఈ డైలాగ్స్ చెప్పింది ఎవరో కాదు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ .. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్. వీరిద్దరూ పోటీ పడి నటించిన మూవీ “థగ్స్ ఆఫ్ హిందుస్థాన్”. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ ను సోషల్ మీడియా ద్వారా రాజమౌళి ఈరోజు రిలీజ్ చేశారు. యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ చిత్ర టైలర్ విశేషంగా ఆకట్టుకుంది. అద్భుతమైన ఫోటోగ్రఫీ ప్రేక్షకులను మరో లోకంలోకి తీసుకెళ్లేలా ఉంది. హాలీవుడ్ తరహాలో ఈమూవీ రూపుదిద్దుకున్నట్లు ట్రైలర్ చెప్పకనే చెప్పింది.

బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ .. ఫాతిమా సనా షేక్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ మూవీ హిందీతో పాటు తెలుగులోను దీపావళి కానుకగా నవంబర్ 8వ తేదీన థియేటర్లోకి రానుంది. ఈ ట్రైలర్ రిలీజ్ చేస్తూ.. “అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్ లను ఒకే ఫ్రేమ్ లో చూస్తుంటే చాల ఆనందంగా ఉంది. రెండు కళ్లు సరిపోవడం లేదు. ఈ చిత్రం ఘనవిజయం సాధించాలి” అంటూ రాజమౌళి వారికి శుభాకాంక్షలు చెప్పారు. అలాగే సినీ విశ్లేషకులు ఈ మూవీ భారీ కలక్షన్స్ రాబడుతుందని అంచనావేస్తున్నారు. బాహుబలి కంక్లూజన్ రికార్డులను తిరగ రాస్తోందని బాలీవుడ్ వర్గాల వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus